Andhra Pradesh: ఔరా అనిపించిన సూక్ష్మ కళాకారుడు.. బియ్యం గింజపై చంద్రబాబు చిత్రం..!

సూక్ష్మ కళాకారులలో ఒక్కొకరిదీ ఒక్కో టైప్.. ఇటీవల కొందరు సూక్ష్మ కళాకారులు తమ నైపుణ్యంతో పలువురి మన్ననలు పొందుతున్నారు. కొందరు పెన్సిల్ చివర ఉండే కార్బన్ లెడ్లపై ప్రముఖుల జీవిత చరిత్రలు రాస్తుంటే, మరికొందరు అగ్గిపుల్లలపై అనేక చిత్రాలు సృష్టించారు.

Andhra Pradesh: ఔరా అనిపించిన సూక్ష్మ కళాకారుడు.. బియ్యం గింజపై చంద్రబాబు చిత్రం..!
Miniature Artist Sivaprasad

Edited By: Balaraju Goud

Updated on: Jun 12, 2024 | 4:38 PM

సూక్ష్మ కళాకారులలో ఒక్కొకరిదీ ఒక్కో టైప్.. ఇటీవల కొందరు సూక్ష్మ కళాకారులు తమ నైపుణ్యంతో పలువురి మన్ననలు పొందుతున్నారు. కొందరు పెన్సిల్ చివర ఉండే కార్బన్ లెడ్లపై ప్రముఖుల జీవిత చరిత్రలు రాస్తుంటే, మరికొందరు అగ్గిపుల్లలపై అనేక చిత్రాలు సృష్టించారు. ఈ క్రమంలోనే దేశంలో జరిగే సంఘటనలు తన సూక్ష్మ నైపుణ్యం జోడించి బియ్యం గింజలపై అందమైన చిత్రాలను మలచి అబ్బురపరుస్తున్నారు. తమదైన శైలితో ప్రతిభ ప్రదర్శిస్తూ, పలువురి మన్ననలు పొందుతున్నారు.

ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా శనివారపుపేటకు చెందిన దొర శివప్రసాద్ చిన్నతనం నుంచి సూక్ష్మ చిత్రాలపై ఎంతో ఆసక్తి పెంచుకున్నారు. అందులో భాగంగా బియ్యం గింజలపై స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ, సినీ నటుల చిత్రాలను గీయడం ప్రారంభించారు. తాజాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించింది. దాంతో నాలుగోసారి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ క్రమంలో శివ ప్రసాద్ బియ్యం గింజపై చంద్రబాబు చిత్రాన్ని గీసి ఆయనకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు.

అంతేకాక చంద్రబాబుపై శివప్రసాద్ కు ఎనలేని అభిమానం. బియ్యం గింజపై చంద్రబాబు చిత్రాన్ని చెక్కి శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నారు. 30 ఏళ్లుగా సూక్ష్మ కళాకారుడుగా జీవనం సాగిస్తూ ఎంతోమంది చిత్రాలను బియ్యం గింజలపై చెక్కి ఇప్పటికే అనేకమంది మన్ననలు పొందారు. సందర్భాన్ని బట్టి అక్కడ జరుగుతున్న కార్యక్రమం కళ్ళ ముందు ఆవిష్కృతం అయ్యేవిధంగా బియ్యం గింజల పై చిత్రాలు గీయడం ఒక్క శివప్రసాద్ కి దక్కింది. ఆయన ప్రతిభను గుర్తించి అనేక మంది అవార్డులు రివార్డులతో సత్కరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సూక్ష్మ చిత్రాలు నిర్మించి, సూక్ష్మ కళా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు శివప్రసాద్ తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..