పోస్ట్ ఆఫీస్‌కు సెక్యూరిటీ గార్డుగా విధులు.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

| Edited By: Balaraju Goud

Jul 30, 2024 | 5:46 PM

సాటి మనిషిని పట్టించుకోని ఈ రోజుల్లో మనుషుల కన్నా జంతువులే ఎంతో మేలనిపిస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎండకు తాళలేక ఇబ్బంది పడుతున్న ఓ శునకానికి ఆశ్రయం కల్పించారన్న కృతజ్ఞత భావంతో వారిని విడిచి పోకుండా వారికి రక్షకుడిగా మారింది ఆ శునకం.

పోస్ట్ ఆఫీస్‌కు సెక్యూరిటీ గార్డుగా విధులు.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Post Office
Follow us on

సాటి మనిషిని పట్టించుకోని ఈ రోజుల్లో మనుషుల కన్నా జంతువులే ఎంతో మేలనిపిస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎండకు తాళలేక ఇబ్బంది పడుతున్న ఓ శునకానికి ఆశ్రయం కల్పించారన్న కృతజ్ఞత భావంతో వారిని విడిచి పోకుండా వారికి రక్షకుడిగా మారింది ఆ శునకం. ఆశ్రయం కల్పించిన వారికి రాత్రీ, పగలు సెక్యూరిటీ గార్డుగా మారిపోయింది. ఇంతకు ఈ శునకం కథ ఏంటో తెలుసుకోవాలంటే ప్రకాశం జిల్లా కు వెళ్ళాల్సిందే..!

ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్‌కు వస్తున్న కస్టమర్లకు ఓ వీధి శునకం ఆకర్షణగా నిలిచింది. గత కొన్ని నెలలుగా పోస్ట్ ఆఫీస్‌కు సెక్యూరిటీ గార్డులాగా ఈ వీధి కుక్క వ్యవహరిస్తోంది. పోస్ట్ ఆఫీస్ ఉదయం తెరిచినప్పటి నుంచి మళ్లీ సాయంత్రం మూతపడే వరకు పోస్ట్ ఆఫీస్ ప్రాంగణాలలో సేద తీరుతూ కాపలా కాస్తుంది. అంతేకాదు రాత్రి వేళల్లో కూడా ఇక్కడే కాపలా కాస్తూ ఎంతో విశ్వాసంగా ఉంటుందని పోస్ట్ ఆఫీస్ సిబ్బంది చెబుతున్నారు. ఎంతోమంది పోస్ట్ ఆఫీస్ కి నిరంతరం వచ్చి పోతుంటారు. అయితే ఎవరికీ ఈ శునకం హాని కలిగించకుండా వ్యవహరిస్తుందని పోస్ట్ ఆఫీస్ సిబ్బంది చెబుతున్నారు. అయితే రాత్రి వేళల్లో కొత్త వ్యక్తులను ఎవరిని పరిసరాల్లోకి రానివ్వదంటున్నారు. తాము ఎటువంటి ఆహారం అందించకపోయినా ఆశ్రయం కల్పించామన్న విశ్వాసంతో ఆ శునకం ఎప్పుడు ఇక్కడే ఉంటూ పోస్ట్ ఆఫీస్ కు రక్షణ ఉంటుందిని పోస్ట్ ఆఫీస్ సిబ్బంది తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..