పిల్లల మనసును గెలుచుకోవాలంటే..? తల్లిదండ్రులు పాటించాల్సిన 8 ముఖ్యమైన విషయాలు..!

పిల్లలు తమ కోరికలను ఎప్పుడూ తల్లిదండ్రులకు స్పష్టంగా చెప్పకపోవచ్చు. తల్లిదండ్రులు పిల్లలతో పూర్తి శ్రద్ధ చూపిస్తూ వారితో సమయం గడపడం చాలా ముఖ్యం. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకుని, అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి. కొత్త విషయాలను నేర్చుకునే సమయంలో వారికి మార్గదర్శకత్వం అందించడం అవసరం.

పిల్లల మనసును గెలుచుకోవాలంటే..? తల్లిదండ్రులు పాటించాల్సిన 8 ముఖ్యమైన విషయాలు..!
Parenting Tips

Updated on: Feb 08, 2025 | 10:49 AM

కొంతమంది పిల్లలు తమ కోరుకునే కోరికలను వ్యక్తం చేయకపోవచ్చు. కానీ తల్లిదండ్రులు దానిని అర్థం చేసుకోవడం, వాటికి అనుగుణంగా చర్య తీసుకోవడం బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ సందర్భంగా పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి ఆశించే 8 విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేమ, అంగీకారం

పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తల్లిదండ్రులు తమను ప్రేమించాలని కోరుకుంటారు. ఉదాహరణకు తప్పు చేసినప్పుడు, స్కూల్ లో ఇబ్బంది పడుతున్నప్పుడు, విచారంగా ఉన్నప్పుడు, ఎలాంటి షరతులు లేకుండా తల్లిదండ్రులు పిల్లలను అంగీకరించాలి.

పూర్తి శ్రద్ధ

తల్లిదండ్రులు ఆఫీసు పని, సాంకేతికత లేదా ఇతర రోజువారీ కార్యకలాపాలపై దృష్టి సారిస్తూ పిల్లలను పట్టించుకోకుండా ఉండే అవకాశం ఉంది. ప్రతి బిడ్డ తల్లిదండ్రులు తమతో సమయం గడపాలని కోరుకుంటారు. మొబైల్ ఫోన్ లేదా ఇతర పనుల్లో నిమగ్నం కాకుండా పిల్లలపై శ్రద్ధ ఉంచాలి. వారితో కాస్త టైమ్ స్పెండ్ చేయండి.

పిల్లలకు మీ సపోర్ట్

పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి ఆశించే ప్రధాన విషయం ఇదే. పిల్లలు కొత్త పనులు చేసినప్పుడు, కొత్త సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు తల్లిదండ్రులు వారికి మద్దతుగా ఉంటారని వారు నమ్మాలి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

సమయం కేటాయించడం

మీ పిల్లలకు బహుమతులు ఇవ్వకుండా వారితో సమయం గడపడం అలవాటు చేసుకోండి. కలిసి పుస్తకం చదవడం, వంట చేయడం, ఆటలు ఆడడం లేదా సాధారణ సంభాషణలో పాల్గొనడం వంటివి పిల్లలను సంతోషంగా ఉంచుతాయి.

భావోద్వేగ మద్దతు

పిల్లలు తమ జ్ఞాపకాలను, ఆలోచనలను పంచుకోవడానికి తరచుగా సురక్షితమైన స్థలాన్ని కోరుకుంటారు. అంటే ఏదైనా చెబితే తల్లిదండ్రులు శిక్షించరన్న భరోసాను మీరు పిల్లలకు ఇవ్వాలి.

అభిప్రాయానికి గౌరవం

పిల్లలు తమ అభిప్రాయాలను వినాలని కోరుకుంటారు. వారిని పట్టించుకోకుండా ఉండకూడదు. అదేవిధంగా వారు చెప్పేది వినాలి.

మార్గదర్శకత్వం

తల్లిదండ్రులు తమను అర్థం చేసుకుని.. నియమాలు విధించడమే కాకుండా వాటిని అమలు చేయాలని పిల్లలు ఆశిస్తారు. ముఖ్యంగా సవాళ్లను ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలని వారు కోరుకుంటారు.

నమ్మకం

పిల్లలు ఒక నిర్దిష్ట దినచర్యను అనుసరించి పెరుగుతారు. తల్లిదండ్రులు పిల్లల విశ్వాసాన్ని దెబ్బతీసే విషయాలను ఎప్పుడూ చేయకూడదు. వారు వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, భావోద్వేగ మద్దతును అందించాలని పిల్లలు భావిస్తారు.