
వేసవి కాలం మొదలైంది. సూర్యుని వేడి నుంచి తట్టుకునేందుకు ప్రజలు ఏసీలు కొనేందుకు క్యూలు కడుతున్నారు. కొంతమంది.. ఏసీలు చాలా ఎక్కువ ధరలు ఉంటాయని వాటిని కొనడం మన వల్ల కాదని లైట్ తీసుకుంటారు. కానీ ఈ ఏసీల ధరలను చూస్తే మాత్రం ఎలాగైన కొనేయాలనిపిస్తుంది. ఎందుకంటే రూ.30000 లోపే మంచి ఏసీలు అందబాటులో ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి
1. వీర్‌పూల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ
ఈ ఏసీ ధర 48 శాతం డిస్కౌంట్ తో రూ.31,990 కే లభిస్తుంది. అలాగే క్రెడిట్ కార్డుల ద్వారా అమెజాన్ లో రూ.1,750 వరకు డిస్కౌంట్ ఇచ్చే బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఏసీకి 4.9 కిలోవాట్ల కూలింగ్ పవర్ సామర్థ్యం ఉంది. ఇందులో 6వ సెన్స్ టెక్నాలజీ, డస్ట్ ఫిల్టర్, స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ (140 V ~ 285 V), టెంపరేచర్ హిడ్డెన్ డిస్‌ప్లే, 34db డెసిబుల్స్ నాయిస్ లతో కూడిన ఫీచర్లు ఉన్నాయి.
2.లోయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ
దీని ధర 44 శాతం డిస్కౌంట్ తో రూ.32,799 కి లభిస్తుంది. క్రెడిట్ కార్టల ద్వారా రూ.1750 వరకు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. దీని కూలింగ్ సామర్థ్యం 4.74 కిలోవాట్స్. ఇందులో 5-ఇన్-1 కన్వర్టబుల్ ఫీచర్ కూడా ఉంది.
3. గోద్రెజ్ 1 టన్ 3 స్టార్, 5-ఇన్-1 కన్వర్టబుల్ కూలింగ్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ
అమెజాన్ లో 31 శాతం తగ్గింపుతో రూ.29,490 కే ఈ ఏసీ దొరుకుతుంది. క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1,750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీని కూలింగ్ సామర్థ్యం 3.5 కిలోవాట్స్. ఇందులో ఇన్వర్టర్ తో కూడిన 5-ఇన్-1 కన్వర్టబుల్ సాంకేతికత, ఐ-సెన్స్ టెక్నాలజీ, 100 శాతం కాపర్ కండెన్సర్, ఎవాపరేటర్ కాయిల్స్, కనెక్టింగ్ ట్యూబ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
4. వోల్టాస్ 1.4 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ
వాల్యూ డే ఆఫర్ కింద 55 శాతం డిస్కౌంట్ తో ఈ ఏసీ రూ.31,999 కే లభిస్తుంది. క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1,750 వరకు డిస్కౌంట్ ఉంటుంది. దీని కూలింగ్ సామర్థ్యం 1.5 కిలోవాట్స్. ఈ ఏసీలో డస్ట్ ఫిల్టర్, యాంటీ మైక్రోబయాల్ ప్రొటెక్షన్, యాంటీ కొరెసివ్ కోటింగ్, ఎల్‌ఈడీ డిస్‌ప్లే , టర్బో, అడ్జస్టబుల్ కూలింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
5. అమెజాన్ బెసిక్ టన్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ
బ్లాక్ బస్టర్ వాల్యూ డే కింద 43 శాతం డిస్కౌంట్ తో దీని ధర రూ.29,990. క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1,750 వరకు డిస్కౌంట్ ఉంటుంది.