Real Hero: ఇతనెవరో గుర్తించారా..? దేశ రక్షణ కోసం తన రక్తం చిందించి.. 31 ఏళ్లకే అమరుడైన వ్యక్తి

|

Nov 26, 2022 | 4:28 PM

మనం ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే.. ఎన్నో ఆర్భాటాలు చేస్తాం. బ్యానర్లు కడతాం. పాలాభిషేకాలు చేస్తాం. కానీ ఇలాంటి రియల్ హీరోలను మాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాం.

Real Hero: ఇతనెవరో గుర్తించారా..? దేశ రక్షణ కోసం తన రక్తం చిందించి.. 31 ఏళ్లకే అమరుడైన వ్యక్తి
The Real Hero
Follow us on

ముంబై ఉగ్రదాడులకు సరిగ్గా నేటికి 14 ఏళ్లు. 2008 నవంబర్ 26న జరిగిన ఆ నరమేధం తలుచుకుంటే ఇప్పటికి కూడా ఒళ్లు జలదరిస్తుంది. పది మంది పాకిస్తానీ టెర్రరిస్టులు.. పిస్టళ్లు, ఏకే-47లు, బాంబులు, గ్రెనేడ్లు ఇతర పేలుడు పదార్థాలతో ముంబైపై విరుచుకుపడ్డారు. లియోపాల్డ్ కెఫే, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ రైల్వే స్టేషన్‌, కామా హాస్పిటల్‌, ఒబెరాయ్‌ ట్రైడెంట్‌, నారిమన్‌ లైట్‌ హౌస్‌, తాజ్ ప్యాలస్ హోటల్ ప్రాంతాల్లో గ్రెనేడ్లు, తుపాకులతో మారణహోమం సృష్టించారు. తాజ్ ప్యాలస్ హోటల్‌లో విదేశీయులను బందీలుగా చేసుకుని.. భారత అధికారులతో బేరసారాలు జరిపారు. 60 గంటల పాటు కొనసాగిన ఉగ్రదాడుల్లో 160కి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. వందలాది మంది గాయాల పాలయ్యారు.

NSG బ్లాక్‌క్యాట్ కమెండోలు రంగంలోకి దిగి ఉగ్రవాదులను చాకచక్యంగా ఏరివేశారు. ఇందులో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర ప్రముఖమైనది. ఆయన దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించారు. రీల్ హీరోల ఆరాధనలో పడి.. మనం ఇలాంటి రియల్ హీరోలను మర్చిపోతున్నాం. ఆఖరికి ఓ రీల్ హీరో వచ్చి సినిమా తీస్తే తప్ప భవిష్యత్ తరాలకు మేజర్ సందీప్ గురించి తెలియని పరిస్థితి ఉందంటే.. ఇంతకంటే బాధాకరమైన విషయం ఉంటుందా..?. గదిలో చిక్కుకున్న ఓ మహిళా ఉద్యోగిని సేఫ్‌గా బయటకు తీసుకొచ్చే క్రమంలో  ఓ ఉగ్ర బుల్లెట్ ఉన్నికృష్ణన్‌ శరీరంలోకి దూసుకెళ్లిన సమయంలో కూడా ఆయన తన సహచరుల గురించి ఆలోచించారు. ఎవరూ ముందుకు రావొద్దని వాకీటాకీ ద్వారా మిగతావారిని హెచ్చరించారు. అలా పౌరుల్ని, తమ తోటి కమాండోలను, దేశ సమగ్రతను కాపాడే క్రమంలో అమరుడయ్యాడు సందీప్.

మేజర్ సందీప్ నేపథ్యం:

మేజర్ ఉన్ని కృష్ణన్ 1977లో కేరళలోని కోజికోడ్‌లో కె. ఉన్నికృష్ణన్, ధనలక్ష్మి దంపతులకు జన్మించారు. వీరి ఫ్యామిలీ  బెంగళూరులో స్థిరపడింది. చిన్న నాటి నుంచే సైన్యంలో చేరాలని బలంగా కాక్షించారు ఉన్నికృష్ణన్. 1995లో మహారాష్ట్రలోని పుణెలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు సందీప్. ఆస్కార్ స్వాడ్రన్‌లో సేవలందించిన ఉన్ని కృష్ణన్,  బిహార్ రెజువెంట్ లోని 7వ బెటాలియన్ లో లెఫ్టినెంట్ గా బాధ్యతలను స్వీకరించారు. 12 జూన్ 2003న కెప్టెన్‌గా,  13 జూన్ 2005న మేజర్‌గా పదోన్నతి పొందాడు.  2006లో ఎన్‌ఎస్‌జీ కమాండో సర్వీసెస్‌లో చేరారు. ఆపై 26/11 ముంబయి దాడుల్లో అమరుడయ్యాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి