Health Care: చలికాలంలో పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా..? తెలిస్తే మీరు తక్షణమే తింటారు..

|

Dec 06, 2022 | 8:34 PM

శీతాకాలంలో పెరుగును తినడం ద్వారా కూడా అనేక ప్రయోజనాలను పొందడమే కాక, ఈ కాలంలో కలిగే అనేక సమస్యలను అరికట్టవచ్చు. కానీ ‘పెరుగు కూలింగ్ ఎఫెక్ట్‌ను కలిగి ఉంటుంది..

Health Care: చలికాలంలో పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా..? తెలిస్తే మీరు తక్షణమే తింటారు..
Curd
Follow us on

శీతాకాలం మొదలయింటే చాలు.. ఎప్పుడూ లేనంతగా మన ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం మరింతగా పెరిగిట్లే. లేకపోతే అనేక సమస్యలు, ఇబ్బందులు తప్పవు. చలికాలంలో తమ ఆరోగ్యం కోసం చాలా మంది తాము తీసుకునే ఆహారం, పానీయాలలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. అది ఆరోగ్యానికి చాలా మంచిది. శీతాకాలంలో పెరుగును తినడం ద్వారా కూడా అనేక ప్రయోజనాలను పొందడమే కాక, ఈ కాలంలో కలిగే అనేక సమస్యలను అరికట్టవచ్చు. కానీ ‘పెరుగు కూలింగ్ ఎఫెక్ట్‌ను కలిగి ఉంటుంది.. చలికాలంలో పెరుగు తినకూడద’ని చాలా మంది చెప్పడం మీరు తరచుగా వినే ఉంటారు. చలికాలంలో పెరుగును తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా వినే ఉంటారు.

అయితే నిపుణులు మాత్రం ఇందుకు భిన్నంగా చెబుతున్నారు. చలికాలంలో పెరుగు తినడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని వారు నమ్ముతారు. పెరుగులోని అనేక పోషకాలు మీ శరీరానికి చలిని తట్టుకునే సామర్థ్యాన్ని కల్పిస్తాయని, తొందరగా ఆహారం జీర్ణమవడానికి అది సహాయపడుతుందని వారు అంటున్నారు.  శీతాకాలంలో పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

మనకు ఉండే కొన్ని చెడు ఆహారపు అలవాట్ల వల్ల మనకు జీర్ణ సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా చలికాలంలో ఆహారపు అలవాట్ల ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శరీరం యొక్క pH స్థాయి కూడా పెరిగిపోతుంది. ఇంకా దాని ప్రభావం మానవ జీర్ణవ్యవస్థ మీద ఎక్కువగా పడుతుంది. మీరు మీ జీర్ణ శక్తిని క్రమబద్ధీకరించాలనుకుంటే, మీరు పెరుగు తీసుకోవచ్చు. ఈ సీజన్‌లో పెరుగు తినడం వల్ల మీ జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

దృఢమైన ఎముకలు..

శీతాకాలంలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలలో ఎముకల నొప్పి ఒకటి. చలి కారణంగా ఎముకలు, వెన్ను నొప్పి చాలా ఎక్కువగానే ఉంటుంది.  ఆ పరిస్థితిని అధిగమించేందుకు మీరు పెరుగు తినవచ్చు. ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా ఎముకల నొప్పులను తగ్గించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగు తీసుకోవడం వల్ల ఎముకల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ..

చలికాలంలో చర్మం తరచూగా పొడిబారడం వల్ల ఇన్ఫెక్షన్లు కలిగే అవకాశం ఉంది. ఆ పరిస్థితిని అధిగమించేందుకు మీరు పెరుగు తినవచ్చు. ఇందులో విటమిన్-సీ, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి చలికాలంలో ఎదురయ్యే పలు సమస్యలను అధిగమించడంలో సహాయపడతాయి.

మెరిసే చర్మం..

మీ ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల మీ చర్మాన్ని మెరుస్తుంది. పెరుగులో ఉన్న మాయిశ్చరైజింగ్ గుణాలు ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. అంతే కాకుండా  బ్లాక్ హెడ్స్‌ను తొలగించడంలో కూడా పెరుగు సహాయపడుతుంది. ఇది మీ చర్మం మచ్చలేనిదిగా మార్చడమే కాక దానిని మెరుసేలా చేస్తుంది.

హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..