చర్మసంరక్షణ కోసం నిత్యం ఉపయోగించే కాస్మొటిక్స్ చర్మానికి మంచివి కాదని తెలిసినా చాలామంది వాటినే ఉపయోగిస్తుంటారు. సహజంగా చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో తెలియకపోవడం కూడా ఇందుకు ఒక కారణమని చెప్పుకోవాలి. ప్రస్తుత కాలంలో వాతావరణం, మన జీవన వీధానం, ఆహారపు అలవాట్లు చర్మానికి అనేక సమస్యలను కలిగిస్తున్నాయి. ఇక వాటి నుంచి చర్మాన్ని కాపాడుకోవడం కోసమే ఈ కాస్మటిక్స్ మీద ఆధారపడవలసి ఉంటుంది. అయితే చర్మ సంరక్షణ కోసం కాస్మటిక్స్ కంటే మనం నిత్యం తినే పండ్లు, పప్పు దినుసులే ఎంతో మెరుగ్గా పనిచేస్తాయి. ముఖ్యంగా బొప్పాయి మన చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిన బొప్పాయి దాదాపు అన్ని సీజన్లలోనూ లభిస్తుంది. వీటిలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు మనకు ఎంతో ఉపయోగకరం, ఆరోగ్యదాయకంగా ఉంటాయి.
అంతేకాక బొప్పాయిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇంకా కొలెస్ట్రాల్‌ని తగ్గించడం ద్వారా గుండె జబ్బులను కూడా నివారిస్తుంది. క్యాల్షియం, పాస్ఫరస్ ఐరన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, గంధకం, క్లోరిన్ వంటి పోషకాలు తగు మోతాదులో కలిగిన బొప్పాయి మన చర్మ సౌందర్యానికి కూడా ఎంతగానో ఉపకరిస్తుంది. మరి బొప్పాయితో ఉన్న ప్రయోజనాలేమిటో, దీనిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..