Oranges Benefits: గర్భిణీ స్త్రీలకు దివ్వ ఔషధం.. నారింజ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు

నారింజలో లిమోనెన్, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉండటమే కాకుండా ఆహారంలో చాలా రుచికరంగా ఉంటుంది. అవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దాదాపు 70% విటమిన్ సి నారింజలో లభిస్తుంది.

Oranges Benefits: గర్భిణీ స్త్రీలకు దివ్వ ఔషధం.. నారింజ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
Orange

Updated on: Oct 18, 2022 | 8:53 PM

ప్రతి ఒక్కరూ పుల్లని తీపి నారింజ, నారింజ రసం ఇష్టపడతారు. జ్యూస్‌లో రుచిగా ఉండడంతో పాటు అనేక పోషకాలు ఉంటాయి. నారింజ, దాని రసం రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆరెంజ్ మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఆరెంజ్ విటమిన్ సి అతిపెద్ద మూలంగా చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన చర్మం, బలమైన జుట్టు, కంటి చూపుకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఇది సర్వరోగ నివారిణి కంటే తక్కువ కాదు. నారింజ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

విటమిన్ సి బ్యాంక్

విటమిన్ సి నారింజలో 70 శాతం వరకు ఉంటుంది. మనకు రోజుంతా ఉత్సాహంగా ఉంచేందుకు ఒక నారింజ మాత్రమే  సహాయపడుతుంది. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉండమే ఇందుకు కారణం. శరీరంలో ఐరన్ నిల్వ చేయడానికి, మెరుగైన రోగనిరోధక శక్తికి అవసరం.

పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది

నారింజలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తొలగించి పేగులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. మన శరీరానికి సరైన మొత్తంలో ఫైబర్ లభిస్తే, అది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మధుమేహం సమస్య నుంచి కూడా ఉపశమనం పొందుతుంది. దీనితో పాటు, నారింజ గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

గర్భిణీ స్త్రీలకు దివ్యౌషధం

మన శరీరం డీఎన్‌ఏతోపాటు ఇతర జన్యు పదార్థాలను తయారు చేయడానికి పని చేస్తుంది. దీనికి బి విటమిన్ ఫోలేట్ అవసరం. గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో నారింజ తినమని వైద్యులు సలహా ఇవ్వడానికి కారణం ఇదే. నారింజను తినడం వల్ల పిల్లల మెదడు సరిగ్గా అభివృద్ధి చెందుతుంది.

శోథ నిరోధక లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి

ఒక నారింజలో 170 కంటే ఎక్కువ ఫైటోకెమికల్స్, 60 ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి ఇతర యాంటీఆక్సిడెంట్ ఫుడ్ లేదా మెడిసిన్ కంటే ఎక్కువ. ఆరెంజ్ క్యాన్సర్, కీళ్లనొప్పులు, మధుమేహం, అల్జీమర్స్ నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం