Yogurt Benefits: పెరుగులో ఇది కలిపి ముఖానికి రాస్తే చాలు.. మీ ముఖం మెరిసిపోతుంది

|

Jul 27, 2023 | 10:12 PM

మన ఇంట్లో పెరుగును ప్రతిరోజూ వాడుతుంటాం. అన్నంలో, మజ్జిగ కోసం పెరుగు ఖచ్చితంగా కావాల్సిందే. ఒక్కరోజు పెరుగును వాడకపోతే.. మరుసటిరోజున దానినే తాలింపు వేసుకుని ఆహారంగా తీసుకుంటాం. పెరుగు మనకు తెలియకుండా చర్మాన్ని తేమగా..

Yogurt Benefits: పెరుగులో ఇది కలిపి ముఖానికి రాస్తే చాలు.. మీ ముఖం మెరిసిపోతుంది
Yogurt Benefits
Follow us on

మన ఇంట్లో పెరుగును ప్రతిరోజూ వాడుతుంటాం. అన్నంలో, మజ్జిగ కోసం పెరుగు ఖచ్చితంగా కావాల్సిందే. ఒక్కరోజు పెరుగును వాడకపోతే.. మరుసటిరోజున దానినే తాలింపు వేసుకుని ఆహారంగా తీసుకుంటాం. పెరుగు మనకు తెలియకుండా చర్మాన్ని తేమగా ఉండేందుకు చాలా హెల్ప్ చేస్తుంది. పెరుగు వలన ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

అయితే పెరుగును ఆహారంగానే కాదు.. ముఖ సౌందర్యానికి, చర్మ సౌందర్యానికి కూడా వాడొచ్చు. ఇది చర్మంపై మృతకణాలను తొలగించి.. మెరిసేలా చేస్తుంది. మరి పెరుగుతో ఆ ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో, అందుకోసం ఏమేం కావాలో చూద్దాం.

ఒక గిన్నెలో 2 టీ స్పూన్ల పెరుగును తీసుకోవాలి. అందులోకి ఒక టీ స్పూన్ గోధుమపిండిని వేసి వుండలు లేకుండా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చేతితో లేదా బ్రష్ తో ముఖానికి రాసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ముఖానికి రాసిన ఈ ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు పెరుగుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. ముఖంపై పేరుకున్న ట్యాన్ తొలగిపోతుంది.

మృతకణాలు కూడా పోయి.. ముఖం అందంగా, సాఫ్ట్ గా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. ఫేస్ ప్యాక్ వేసుకుని కడుక్కున్న వెంటనే సబ్బును వాడితే ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి వీలైనంతవరకూ రాత్రివేళ ఈ ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి