Yoga Tips: రాత్రిపూట నిద్రపట్టడం లేదా..? అయితే ఈ యోగాసనాలతో చెక్ పెట్టండి..

| Edited By: Anil kumar poka

Feb 07, 2022 | 9:11 AM

Yoga Tips in Telugu: ఉరుకులు పరుగుల జీవితం.. ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్య తరచూ వేధిస్తుంది. దీంతో అలసట, పనులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. మంచి నిద్ర కోసం కొన్ని యోగాసనాలు వేస్తే ఫలితం ఉంటుంది. ఈ యోగాసనాలను రాత్రి పడుకునే ముందు వేస్తే మంచిది. ఆ యోగాసనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1 / 5
శవాసన యోగ: నిద్ర లేకపోవడం లేదా అసంపూర్ణ నిద్ర వంటి సమస్యలను తొలగించడంలో ఈ యోగా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ యోగా వల్ల మనసుకు ప్రశాంతత చేకూరి మంచి నిద్ర వస్తుంది.

2 / 5
బలాసన: ఈ యోగా అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరం అంతటా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం వేయడం కూడా చాలా సులభం.

3 / 5
ఉత్తనాసనం: మీ వెన్నముక, భుజాలు, మెడ నొప్పిని తగ్గిస్తుంది. ఇది మిమ్మల్ని ప్రశాంతపరిచి.. ఆందోళనను తగ్గిస్తుంది. ఉత్తనాసనం రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ జరగడం వల్ల మంచి నిద్ర వస్తుంది.

4 / 5
విపరీత కర్ణ: కొన్నిసార్లు కడుపు సంబంధిత సమస్యల వల్ల నిద్ర ఉండదు. అటువంటి పరిస్థితిలో ఈ యోగా ఆసనం చేయడం ద్వారా ఉదర సమస్యలను అధిగమించవచ్చు. ఈ వ్యాయామం రెగ్యులర్‌గా చేయడం వల్ల మీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. మీ ఆకలి పెరుగుతుంది.

5 / 5
సుఖాసనం: ఈ ఆసనం మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఆందోళన, ఒత్తిడి, మానసిక అలసటను తగ్గిస్తుంది. నిద్రపోయే ముందు వేస్తే మంచిగా నిద్రపడుతుంది.