Brain Tumor diseases: ఈ సమయంలో తలనొప్పి వస్తుంటే నెగ్లెక్ట్ చేయకండి.. బ్రెయిన్ ట్యూమర్ కావొచ్చు.. లక్షణాలు ఏమిటంటే..

|

Jun 08, 2024 | 9:05 AM

మెదడు కణితి రావడానికి ఖచ్చితమైన కారణం ఇదని లేనప్పటికీ.. కొన్ని కారకాలు దీనికి కారణం అని వైద్యులు పరిగణిస్తున్నారు. ఎవరైనా అయోనైజింగ్ రేడియేషన్‌కు గురైనట్లయితే బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా ఎవరి ఫ్యామిలిలోనైనా ఈ వ్యాధి ఉన్నట్లయితే.. కుటుంబ సభ్యులకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. లుకేమియాతో బాధపడేవారికి కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.

Brain Tumor diseases: ఈ సమయంలో తలనొప్పి వస్తుంటే నెగ్లెక్ట్ చేయకండి.. బ్రెయిన్ ట్యూమర్ కావొచ్చు.. లక్షణాలు ఏమిటంటే..
Brain Tumor Day
Follow us on

ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ ట్యూమర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇది ఒకరకమైన ప్రాణాంతక వ్యాధి. దీనిని సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే మరణానికి దారితీస్తుంది. ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 8న ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి మెదడు లోపల కలుగుతుంది. ఇది క్యాన్సర్, నాన్-క్యాన్సర్ రెండూ కావచ్చు. కొన్ని మెదడు కణితులు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. కణితులు చాలా వేగంగా పెరుగుతాయి.

గురుగ్రామ్‌లోని నారాయణ హాస్పిటల్‌లోని న్యూరో సర్జరీ డైరెక్టర్ , హెచ్‌ఓడి డాక్టర్ ఉత్కర్ష్ భగత్ బ్రెయిన్ ట్యూమర్ గురించి అనేక విషయాలను వెల్లడించారు. మెదడులో కణితి ఎక్కువగా అభివృద్ధి చెందినప్పుడు మెదడు లోపల మార్పులు జరగడం ప్రారంభిస్తాయి. దీని వల్ల మెదడు దెబ్బతింటుంది. ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్.. క్యాన్సర్ ఉంటే..ఇది చికిత్స తర్వాత కూడా తిరిగి వస్తుంది. అంతేకాదు ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. అయితే.. క్యాన్సర్ కాని కణితి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

మెదడు కణితి ఏర్పడడానికి కారణాలు ఏమిటి?
మెదడు కణితి రావడానికి ఖచ్చితమైన కారణం ఇదని లేనప్పటికీ.. కొన్ని కారకాలు దీనికి కారణం అని వైద్యులు పరిగణిస్తున్నారు. ఎవరైనా అయోనైజింగ్ రేడియేషన్‌కు గురైనట్లయితే బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా ఎవరి ఫ్యామిలిలోనైనా ఈ వ్యాధి ఉన్నట్లయితే.. కుటుంబ సభ్యులకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. లుకేమియాతో బాధపడేవారికి కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.

ఇవి కూడా చదవండి

లక్షణాలు ఏమిటంటే?
ధర్మశిల నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని న్యూరోసర్జరీ విభాగం హెచ్‌ఓడి డాక్టర్ ఆశిష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ బ్రెయిన్ ట్యూమర్‌లో అనేక రకాల లక్షణాలు ఉన్నాయని చెప్పారు. క్రమంగా తలనొప్పి పెరగడం, ఆలోచన, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, అస్పష్టమైన దృష్టి, బద్ధకం, అలసట బ్రెయిన్ ట్యూమర్ ప్రారంభ లక్షణాలు.

ఎవరికైనా తరచుగా తలనొప్పి, అస్పష్టమైన దృష్టి సమస్య ఉంటే.. ఈ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. ఈ లక్షణాలు మెదడు కణితికి ప్రారంభానికి చిహ్నం. కనుక ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఉదయం వచ్చే తలనొప్పిని తేలికగా తీసుకోకండి

వైశాలిలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని న్యూరోసర్జరీ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ వైష్ మాట్లాడుతూ.. కొందరిలో ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవని అయినప్పటికీ బ్రెయిన్ ట్యూమర్‌లు సంభవిస్తుందని వివరించారు. ప్రారంభంలో దీని లక్షణాలు రోజువారీ సమస్యల వలె ఉంటాయి. వీటిని ప్రజలు విస్మరిస్తారు. తలనొప్పి రావడం లేదా రోగి ఇప్పటికే తలనొప్పి సమస్యతో బాధపడుతుంటే అది తీవ్రంగా మారవచ్చు. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన తలనొప్పి వచ్చి ఈ సమస్య కొనసాగితే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వెల్లడించారు.

బ్రెయిన్ ట్యూమర్‌కి చికిత్స ఏమిటి?
బ్రెయిన్ ట్యూమర్ ను ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్స చేయవచ్చని సుశ్రుత బ్రెయిన్ అండ్ స్పైన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ యశ్ పాల్ సింగ్ బుందేలా చెబుతున్నారు. కణితిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. కణితి చిన్నగా ఉంటే రేడియేషన్, ప్రభావవంతమైన మందులతో తగ్గించవచ్చు. కణితి పెద్దదైతే శస్త్రచికిత్స చేసి తొలగించ వచ్చు అని చెప్పారు. దీని కోసం ముందుగా బాధిత రోగిని పరీక్షించాలని వెల్లడించారు. ఇందుకోసం ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ చేస్తారు. దీని తర్వాత రోగికి తగిన చికిత్సనందిస్తారు.

 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..