World Aids Day 2021: తరచుగా వచ్చే జ్వరం HIV ప్రాథమిక లక్షణం కావొచ్చు..! పరీక్ష చేయించుకోవడంలో ఆలస్యం చేయవద్దు..

|

Dec 01, 2021 | 5:56 PM

World Aids Day 2021: కరోనా వైరస్ కాలంలో హెచ్‌ఐవి గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇది ఒక రకం వైరస్ అయినప్పటికీ ఇప్పటి వరకు దీనికి చికిత్స కనుగొనలేదు.

World Aids Day 2021: తరచుగా వచ్చే జ్వరం HIV ప్రాథమిక లక్షణం కావొచ్చు..! పరీక్ష చేయించుకోవడంలో ఆలస్యం చేయవద్దు..
World Aids Vaccination Day
Follow us on

World Aids Day 2021: కరోనా వైరస్ కాలంలో హెచ్‌ఐవి గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇది ఒక రకం వైరస్ అయినప్పటికీ ఇప్పటి వరకు దీనికి చికిత్స కనుగొనలేదు. ఈ ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే ఉత్తమ మార్గం. దేశంలోని ప్రజలలో HIV నివారణ గురించి అవగాహన చాలా పెరిగింది కానీ ఇప్పటికీ దాని ప్రారంభ లక్షణాల గురించి చాలా మందికి తెలియదు. తరచుగా జ్వరం రావడం, నిత్యం ఆయాసంతో కూడిన సమస్య ఉండడం హెచ్‌ఐవీ లక్షణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

హెచ్‌ఐవిని వైద్య పరిభాషలో హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ అని పిలుస్తారు. ఈ వైరస్ శరీర రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఒక వ్యక్తి HIV నివారణకు చికిత్స ప్రారంభించకపోతే కొంతకాలం తర్వాత AIDS వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న రోగికి ఏదైనా వ్యాధి ఉంటే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. HIV పాజిటివ్ వ్యక్తులు ఈ వైరస్‌తో ఎక్కువ కాలం జీవిస్తారు.

ఇవి లక్షణాలు
తరచుగా జ్వరం, నిరంతర తలనొప్పి, అలసటగా అనిపించడం, ఆకస్మికంగా బరువు తగ్గడం, కీళ్ల నొప్పులు, విపరీతమైన చెమట, నోటిలో తెల్లగా మారడం, హెచ్‌ఐవి ప్రారంభ లక్షణాలుగా చెప్పవచ్చు. మచ్చలు, న్యుమోనియా, క్షయ, అతిసారం కూడా చేర్చారు. ఇవి కాకుండా ఒక వ్యక్తికి గాయం మానకుండా ఉంటే దీంతో పాటు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుంటే తప్పనిసరిగా HIV పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది.

ఇలా రక్షించండి
ఇప్పటి వరకు ఎయిడ్స్‌కు సరైన చికిత్స అందుబాటులో లేదు. ఈ వ్యాధి నుంచి దూరంగా ఉండటానికి నివారణ ఒక్కటే ఉత్తమ చికిత్స. అందుకోసం అసురక్షిత సంబంధాలను నివారించాలి. రక్తం తీసుకునే ముందు వైద్యులచే పరీక్షించాలి. ఇంజెక్షన్లు ఇచ్చేటప్పుడు డిస్పోజబుల్ సిరంజిలు, సూదులు మాత్రమే ఉపయోగించాలి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో హెచ్‌ఐవి సోకిన రోగుల సంఖ్య దాదాపు 24 లక్షలు. గత 9 ఏళ్లలో ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య 37 శాతం తగ్గిందని నివేదికలో పేర్కొంది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కూడా బాగా పెరిగింది.

IBPS: డిసెంబర్‌ 12 నుంచి IBPS క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష.. ఎగ్జామ్‌ నమూనా, తదితర వివరాలు..

Mphil PHD: ఎంఫిల్, పిహెచ్‌డి విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. థీసిస్ సమర్పణ తేదీ పొడగింపు..

పెట్రోల్‌, డీజిల్ GST పరిధిలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా..? ఈ మార్పులు సంభవిస్తాయి..