Heart Disease: పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా గుండె జబ్బులు.. కారణం ఏంటంటే..!

|

Mar 11, 2022 | 2:29 PM

Heart Disease: గుండె జబ్బులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. జీవనశైలి కారణంగా ఎన్నో రోగాలు దరిచేరుతున్నాయి. ప్రస్తుతం గుండెజబ్బుల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది...

Heart Disease: పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా గుండె జబ్బులు.. కారణం ఏంటంటే..!
Follow us on

Heart Disease: గుండె జబ్బులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. జీవనశైలి కారణంగా ఎన్నో రోగాలు దరిచేరుతున్నాయి. ప్రస్తుతం గుండెజబ్బుల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇక పురుషులు, మహిళల్లో గుండె (Heart)కు సంబంధించిన వ్యాధుల ప్రభావం ఇద్దరికీ భిన్నంగా ఉంటుంది. గార్డియన్ నివేదిక ప్రకారం.. ఒక మహిళ ఒత్తిడికి గురైనప్పుడు గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. గుండె మరింత రక్తాన్ని సరఫరా చేయడం ప్రారంభిస్తుంది. అదే సమయంలో ఒక మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు ధమనులు కుంచించుకుపోతాయి. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. ఈ విధంగా పురుషులు, స్త్రీలలో వివిధ రకాల ప్రతిచర్యలు కనిపిస్తాయి.

కొన్ని గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందని నివేదిక చెబుతోంది. మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ గుండె జబ్బుల నుండి కొంతవరకు రక్షణను ఇస్తుంది. కానీ వయస్సుతో ఈ హార్మోన్ తగ్గడం ప్రారంభించినప్పుడు గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. మహిళల్లో హార్మోన్ల స్థాయి తగ్గడం వల్ల గుండెపోటు కేసులు సగటున 70 సంవత్సరాల వయస్సులో మాత్రమే వస్తాయి. పురుషులలో ఇది 66 సంవత్సరాల వయస్సులో జరుగుతుంది. పురుషులు, స్త్రీలలో గుండెపోటు లక్షణాలలో కూడా తేడా ఉంటుంది. పురుషులలో గుండెపోటు సమయంలో ఛాతీ నొప్పి ఉంటుంది. అయితే మహిళల్లో ఈ నొప్పి గుండెపోటుకు 3 లేదా 4 వారాల ముందు నుంచే ఎదురవుతుంటుంది.

పురుషుల కంటే మహిళల్లో గుండెపోటు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. చికిత్స కోసం ఆసుపత్రిలోనే ఎక్కువ సేపు ఉండాల్సి వస్తోంది. మహిళలు సాధారణంగా గుండెపోటు ప్రమాద కారకాలపై పెద్దగా శ్రద్ధ చూపరు. గుండెపోటు తర్వాత పురుషుల కంటే మహిళలకు మళ్లీ గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అధ్యయనాల ద్వారా తేల్చారు. దీనికి కారణం కూడా ఉంది. గుండెపోటు తర్వాత మహిళల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల మళ్లీ గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

White Hair: షాంపూలో వీటిని మిక్స్‌ చేసి వాడితే తెల్లజుట్టు నల్లగా మారుతుంది..!

Eating Fast: వేగంగా తినడం వల్ల చాలా నష్టాలు.. తెలిస్తే ఎప్పుడు అలా ట్రై చేయరు..!