Heart Attack: అలాంటి మహిళలకి గుండెపోటు ప్రమాదం ఎక్కువ.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు

|

Mar 02, 2022 | 3:55 PM

Women: క‌రోనా వైర‌స్ యుగంలో గుండె జ‌బ్బుల‌కు సంబంధించిన వారు చాలా స‌మ‌స్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు ఇప్పటికే కరోనరీ ఆర్టరీ వ్యాధి,

Heart Attack: అలాంటి మహిళలకి గుండెపోటు ప్రమాదం ఎక్కువ.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు
Women
Follow us on

Heart Attack: క‌రోనా వైర‌స్ యుగంలో గుండె జ‌బ్బుల‌కు సంబంధించిన వారు చాలా స‌మ‌స్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు ఇప్పటికే కరోనరీ ఆర్టరీ వ్యాధి, అధిక రక్తపోటు, గుండె వైఫల్యం వంటి సమస్యలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పురుషులతో పోలిస్తే మహిళలకు గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువ. అయితే ముఖ్యంగా ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో గుండె జబ్బులు పురుషుల మాదిరిగానే ఉంటాయి. పురుషులతో పోలిస్తే మహిళలు 20 శాతం గుండె వైఫల్యానికి గురవుతారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ మహిళలలో ధూమపానం చేసేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. నగరాల్లో మాత్రం ధూమపానం చేసే మహిళల నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. ధూమపానం గుండె , ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. గుండెపోటుకు ప్రధాన కారణమవుతుంది. కాబట్టి మహిళలు పొగతాగడం పూర్తిగా మానేస్తే మంచిది.

మహిళలు ఒంటరిగా చాలా పనులు చేస్తున్నారు. ఇల్లు, ఆఫీసు పనులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాయామం మరిచిపోతున్నారు. పురుషులు లేదా స్త్రీలు రోజుకు కనీసం 30 నిమిషాలు, వారానికి కనీసం 5 రోజులు మితమైన వ్యాయామం చేయాలి. అలా చేయకపోతే స్త్రీలకు గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గుండె రోగి ఆరోగ్యకరమైన, సమతుల్య జీవనశైలిని నిర్వహించడం చాలా ముఖ్యం. మహిళలు తమ బరువు పట్ల అజాగ్రత్తగా ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు విపరీతంగా బరువు పెరుగుతున్నారు. ముఖ్యంగా బిడ్డ పుట్టిన తర్వాత చాలా మంది బరువు పెరుగుతారు. సరైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా అధిక బరువుకి దూరంగా ఉండొచ్చు.

Hyderabad: చెవి నొప్పితో ఆస్పతికి వెళ్లిన మహిళ.. అడ్మిట్ చేసుకున్న వైద్యులు.. తెల్లారేసరికి ఊహించని షాక్

Anand Mahindra: ఇదే కదా నిజమైన క్రమశిక్షణ.. ఆనంద్ మహీంద్ర ట్వీట్.. ఫొటో వైరల్.. ఎందుకంటే..

Shocking Video: ఉక్రెయిన్‌లో ఆగని రష్యా దాడులు.. పోలీస్ కార్యాలయంపై క్షిపణి దాడి.. షాకింగ్ వీడియో