AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో.. గర్భనిరోధక ఇంజెక్షన్ తీసుకుంటే కంటి చూపు గోవిందా! వైద్యుల హెచ్చరిక

కుటుంబ నియంత్రణ కోసం లేదా అవాంఛిత గర్భాన్ని నిరోధించడానికి నేటి కాలంలో మహిళలు ఎన్నో రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. గర్భనిరోధక మాత్రలు, కాపర్‌-టి లతో పాటు ఇటీవల కాలంలో కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్లు తీసుకోవడం కూడా పెరిగింది. అయితే, ఇటువంటి ఇంజెక్షన్ల వల్ల కొన్నిసార్లు ప్రాణాంతక లేదా అత్యంత ప్రమాదకరమైన దుష్ప్రభావాలు ఎదురవుతాయని బ్రిటన్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటన నిరూపించింది. బ్రిటన్‌కు చెందిన ఒక మహిళ గర్భనిరోధక ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత తన కంటి చూపును పూర్తిగా కోల్పోయింది. ఈ భయంకరమైన ఘటనకు సంబంధించిన వివరాలు, దీనిపై వైద్య నిపుణుల అభిప్రాయాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఓరీ దేవుడో.. గర్భనిరోధక ఇంజెక్షన్ తీసుకుంటే కంటి చూపు గోవిందా! వైద్యుల హెచ్చరిక
Birth Control Injection Risks
Jyothi Gadda
|

Updated on: Jun 09, 2026 | 12:50 PM

Share

బ్రిటన్‌లో గర్భనిరోధక ఇంజెక్షన్ తీసుకున్న ఒక మహిళ తన చూపును కోల్పోవడం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ ఇంజెక్షన్ తీసుకున్న కొన్ని రోజులకే ఆమెకు తీవ్రమైన తలనొప్పి, కంటి చూపు మసకబారడం వంటి సమస్యలు మొదలై, చివరికి పూర్తిగా చూపు పోయింది. ఈ ఘటనపై వైద్య నిపుణులు స్పందిస్తూ.. గర్భనిరోధక ఇంజెక్షన్ల వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని, ఇది కొన్ని అరుదైన కేసులలో మెదడు, కంటి నరాలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుందని తెలిపారు. గర్భనిరోధక సాధనాలను వాడే ముందు మహిళలు ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలని, ఏవైనా తేడాలు వస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని హెచ్చరిస్తున్నారు.

సదరు మహిళ అవాంఛిత గర్భాన్ని నివారించడానికి వైద్యుల సూచనతో ఒక కాంట్రాసెప్టివ్ ఇంజెక్షన్‌ను తీసుకుంది. అయితే, ఇంజెక్షన్ తీసుకున్న కొన్ని రోజులకే ఆమెకు విపరీతమైన తలనొప్పి ప్రారంభమైంది. మొదట్లో దాన్ని సాధారణ తలనొప్పిగా భావించినప్పటికీ, రోజులు గడిచేకొద్దీ ఆమెకు కంటి చూపు మసకబారడం మొదలైంది. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే రెండు కళ్ల చూపు పూర్తిగా పోయింది. వైద్యులు పరీక్షించగా, ఆ ఇంజెక్షన్ వికటించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తేలింది.

ఈ అరుదైన, విచారకరమైన ఘటనపై వైద్య నిపుణులు స్పందించారు. సాధారణంగా గర్భనిరోధక ఇంజెక్షన్లలో ప్రొజెస్టెరాన్ లేదా ఇతర కృత్రిమ హార్మోన్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఓవ్యులేషన్ ప్రక్రియను అడ్డుకుంటాయి. అయితే, కొందరి శరీర తత్వానికి ఈ హార్మోన్లు పడకపోవడం వల్ల శరీరంలో ద్రవాల ఒత్తిడి పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

వైద్యుల ప్రకారం, దీనివల్ల ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్‌టెన్షన్ అనే అరుదైన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే, మెదడు చుట్టూ ఉండే ద్రవాల ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ఒత్తిడి కంటికి, మెదడుకు అనుసంధానంగా ఉండే ఆప్టిక్ నరాల పై పడటం వల్ల చూపు శాశ్వతంగా లేదా తాత్కాలికంగా పోయే ప్రమాదం ఉంటుంది.

మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

వైద్యులు ఈ ఘటనపై స్పందిస్తూ.. మహిళలు ఎలాంటి గర్భనిరోధక సాధనాలు మాత్రలు, ఇంజెక్షన్లు లేదా ప్యాచ్‌లు వాడాలన్నా, ముందుగా తమ గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, శరీర తత్వానికి ఏది సురక్షితమో పరీక్షించుకోవాలని సూచించారు. ముఖ్యంగా, ఇటువంటి ఇంజెక్షన్లు తీసుకున్న తర్వాత తీవ్రమైన తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం లేదా చూపులో మార్పులు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us