ఈ చలికాలంలో దగ్గు, జలుబు అస్సలు తగ్గడం లేదా? ఈ ఆయుర్వేద చిట్కాలతో చెక్ పెట్టండి..

|

Jan 27, 2023 | 7:37 AM

చలికాలంలో సాధారణంగానే జలుబు, దగ్గు సమస్య తీవ్రంగా వేధిస్తాయి. చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రజల మధ్య తిరిగే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది..

ఈ చలికాలంలో దగ్గు, జలుబు అస్సలు తగ్గడం లేదా? ఈ ఆయుర్వేద చిట్కాలతో చెక్ పెట్టండి..
Cold Feeling
Follow us on

చలికాలంలో సాధారణంగానే జలుబు, దగ్గు సమస్య తీవ్రంగా వేధిస్తాయి. చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రజల మధ్య తిరిగే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అయితే, సాధారణ జలుబు మీకు పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. కానీ, అది వ్యక్తిని అలసిపోయేలా చేస్తుంది. శక్తిని క్షీణింపజేస్తుంది. దీనికి తుమ్ము, దగ్గు వంటివి తోడైతే.. ఇక సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. అనేక సందర్భాల్లో ఈ జలుబు కారణంగా చెవిపోటు సమస్య కూడా వస్తుంది. కొన్నిసార్లు ఆస్తమా లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. దీర్ఘకాలిక జలుబు తీవ్రమైన సైనసైటిస్‌కు కారణమవుతుంది. ఇది సైనస్‌లలో వాపు కి దారితీస్తుంది.

అయితే, జలుబులో రకాలు ఉంటాయి. స్ట్రెప్ థ్రోట్, న్యుమోనియా, బ్రోన్కైటిస్ వంటి ఇతర సాధారణ జలుబు సమస్యల గురించి ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. వీటిలో అత్యంత సాధారణమైనవి రైనోవైరస్లు. సాధారణ జలుబు వైరస్ నోరు, కళ్ళు, ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. గాలిలోని తేమ ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. ఇదిలాఉంటే.. శీతాకాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందడానికి.. ఆయుర్వేద చిట్కాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నువ్వుల నూనె..

నువ్వుల నూనె చుక్కలు నాసికా భాగాల సహజ సరళతకు రక్షణనిస్తాయి. చికాకు, తుమ్ముల నుండి ఉపశమనం కలిగిస్తాయి. నువ్వుల నూనె శరీరంపై వేడిని పెంచుతుంది. కండరాల నొప్పి, దగ్గు, జలుబును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆవిరి పీల్చడం..

తేమ, వెచ్చదనం కలయిక ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తలనొప్పి నివారణకు కూడా సహాయపడుతుంది. వేడి నీటితో ఆవిరి పట్టడం ద్వారా జలుబు, దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

జలనేతి ఆచారం..

నాసికా రంద్రాల్లో మంటలను, చికాకును తగ్గించడంలో జలనేతి అద్భుమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఆయుర్వేద టెక్నిక్ మీ నాసికా కుహరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. జలనేతి అంటే ఒక నాసికా రంధ్రంలో నీటిని పోసి, నాసికా మార్గాన్ని క్లియర్ చేయడానికి మరొక ముక్కు రంధ్రం నుండి బయటకు తీయడం జరుగుతుంది.

హైడ్రేట్‌గా ఉండాలి..

తగినంత నీరు తీసుకోవడంతో పాటు, ఘాటైన రసాలు కూడా తీసుకోచ్చు. అజ్వైన్, జీలకర్ర, అల్లం, దాల్చినచెక్క వంటి సుగంధ ద్రవ్యాలతో ఉడకబెట్టిన నీరు జీర్ణ, కడుపుమంట, రక్త ప్రసరణకు సహకరిస్తుంది.

యోగా..

యోగాసనాలు, ప్రాణాయామం కూడా నాసికా రంద్రాలను క్లియర్ చేయడానికి సహాయపడతాయి. ప్రభావవంతంగా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..