మనకు తెలియకుండానే కొన్నింటిని కలిపి తింటుంటాం. అలా అస్సలు తినొద్దని ఆహార నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఎందుకు వద్దని అంటున్నారో మనకు తెలియదు. వాటిని తింటే ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కాదు. వీటిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మనం ఫక్షన్లలో, చపాతీతో కలిపి పాలక్ పన్నీను లాగిస్తుంటాం. అయితే ఈ పాలకూర, పనీర్‌ను కలిపి తినకూడదని సూచిస్తున్నారు పోషకాహార నిపుణుడు న్మామి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలలో ఒకదానిలో దీనికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేశారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అంటే సరైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాదని అగర్వాల్ అంటున్నారు. అంటే సరైన ఆహారాన్ని సరైన కాంబినేషన్‌లో తినడం. కొన్ని కాంబినేషన్లు ఉన్నాయని, వీటిని కలిపి తింటే ఒకదానిలోని పోషకాలు మరొకదానితో చెక్ పెట్టినట్లుగా మారుతుందని అంటున్నారు. ఎందుకు పాలక్ పన్నీర్ తినొద్దని అంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
క్యాల్షియం, ఐరన్ ఈ రెండిటి కలయికను అసహజ కలయిక అని సూచిస్తున్నారు. పాలకూరలో ఐరన్ ఉంటుందనే విషయం మనకు తెలుసు. అలాగే పన్నీర్.. పాల నుంచి తయారు చేస్తారు. ఇందులో క్యాల్షియం ఎక్కువ ఉంటుంది. కానీ, క్యాల్షియం అన్నది ఐరన్‌ను మన శరీరం తీసుకోకుండా అడ్డుపడుతుంది. అంటే పన్నీరులో ఉండే క్యాల్షియం పాలకూరలో లభించే ఐరన్ ను మన శరీరంకు అందకుండా చేస్తుంది. కనుక పాలక్ పన్నీర్ కలిపి తీసుకున్నప్పుడు పాలకూరలో ఉండే ఐరన్ మన శరీరానికి అందకుండా పన్నీర్ లోని క్యాల్షియం బ్రేకులు వేస్తుంది. అందుకే ఐరన్‌తో కాల్షియం తీసుకోకూడదు. అదే పాలకూర-బంగాళదుంప లేదా పాలకూర-మొక్కజొన్న అంటే కార్న్ తీసుకోవచ్చని.. ఇందులో గరిష్టంగా ఇనుము ఇందులో లభిస్తుంది.
అదే సమయంలో, పోషకాహార నిపుణులు కూడా దీనిపై అంగీకరించారు. ఈ రెండింటిని కలిపి తినకూడదని సూచిస్తున్నారు. అలాగే, పాలు, టీ, కాఫీతోపటు ఇతర పాల ఉత్పత్తులతో ఐరన్ సప్లిమెంట్లను తీసుకోరాదని అంటున్నారు. ఆహారంతో పాటు టీ కూడా తీసుకోకూడదు.
కందిపప్పు, బీన్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పెరుగును మునపప్పు, కిడ్నీ బీన్స్, ఇతర పప్పులతో కలిపి తినకూడదని సూచించారు. ఐరన్ పుష్కలంగా ఉండే పాలకూర,పనీర్ కలిపి తినకూడదు. ఫిట్‌నెస్, పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ సిద్ధాంత్ భార్గవ కూడా అగర్వాల్‌తో ఏకీభవించారు. పాలకూర-పనీర్ సరైన కలయిక కాదని అంటున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం