యాపిల్ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. కానీ వీరు మాత్రం తినకూడదు..!
యాపిల్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికి తెలిసిందే. రోజూ ఒక యాపిల్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగిన వారు యాపిల్‌ను తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Feb 02, 2025 | 6:12 PM

మనలో కొంత మంది గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు యాపిల్‌ను లిమిటెడ్ గా తీసుకోవాలట. యాపిల్‌లో పుష్కలంగా ఉన్న ఫైబర్ జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెడుతుంది. ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి, కడుపులో తిమ్మిరి వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఈ సమస్యలు ఉన్నవారు వైద్యుడిని అడిగి తినడం మంచిది.

డయాబెటిస్ వారు కూడా యాపిల్‌ను ఎక్కువగా తినకూడదు. యాపిల్ సహజ చక్కెరతో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. డయాబెటిక్ రోగులు అధిక చక్కెరతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరిగి పరిస్థితి మరింత కట్టుదిట్టం అవుతుంది. కనుక డయాబెటిక్ వారు యాపిల్ తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవడం ముఖ్యం.

డయేరియా ఉన్నవారు యాపిల్ తినడం మానుకోవడం మంచిది. యాపిల్‌లో ఉన్న ఫైబర్ ప్రేగుల కదలికను ప్రోత్సహిస్తుంది. ఇది డయేరియా సమస్యను మరింత తీవ్రం చేయవచ్చు. విరేచనాలు, వాంతులు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే డయేరియా బాధితులు యాపిల్ తినకూడదు.

అధిక బరువు, ఊబకాయం సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారు. యాపిల్‌లో కేలరీలు, చక్కెర ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరగడాన్ని మరింత ప్రోత్సహిస్తుంది. అటువంటి వారు ఎక్కువగా యాపిల్ తినడం వల్ల వారి బరువు తగ్గడం కష్టతరం అవుతుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు యాపిల్‌ను లిమిటెడ్ గా తీసుకోవడం మంచిది.

కొంతమందికి యాపిల్ తినడం వల్ల అలెర్జీ సమస్యలు వస్తాయి. దీనివల్ల చర్మంలో దురద, దద్దుర్లు, వాపు వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఇంకా శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు కలుగవచ్చు. అలెర్జీ ఉన్న వారు యాపిల్ తినడం మానుకోవడం మంచిది.

రాత్రి సమయాల్లో యాపిల్ తినడం వల్ల కడుపులో ఆమ్ల స్థాయిలు పెరిగిపోతాయి. ఈ ఆమ్ల స్థాయిలు జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెంచుతాయి. అందువల్ల ఎసిడిటీ సమస్యలు ఏర్పడవచ్చు. ఆమ్లతత్వం పెరగడం వలన జీర్ణక్రియపై మరింత భారం పడుతుంది. కనుక యాపిల్‌ను ఉదయం టిఫిన్ తర్వాత తీసుకోవడం మేలు. రాత్రి వేళల్లో యాపిల్ తినడం చాలా ఇబ్బందులు కలిగిస్తుంది.





























