White Spots On Nails: మీ గోళ్ళను చూసి మీ ఆరోగ్యాన్ని అంచనా వేసుకోవచ్చు. కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని గుర్తించవచ్చు. అయితే ఆయుర్వేదంలో మీ గోళ్లను చూసి, మీరు ఏ వ్యాధులతో బాధపడుతున్నారో చెప్పవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మీరు మీ గోళ్ళపై కూడా తెల్లటి గుర్తులను గమనించినట్లయితే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇది చాలా తీవ్రమైన వ్యాధులకు సంకేతం. గోళ్లు తెల్లగా ఉండడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలుసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఫంగల్ ఇన్ఫెక్షన్
వాస్తవానికి ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణం చెప్పవచ్చు. దీని కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీంతో మీ గోర్లు విరిగిపోవడం, మచ్చలు, పసుపు రంగులోకి మారడం ప్రారంభం అవుతాయి. మీ గోళ్ళలో తెల్లటి మచ్చలు కనిపిస్తే, మీ శరీరంలో కాల్షియం లేదా జింక్ వంటి ఖనిజాల లోపం ఉందని వైద్యులు చెబుతుంటారు. నిజానికి మీ గోర్లలో కొన్ని పోషకాలతో ఇమిడి ఉంటాయి. ఈ పోషకాలు లేకపోవడం వల్ల గోళ్లలో తెల్లటి మచ్చలు ఏర్పడతాయని ఆయుర్వేద నిపునులు చెబుతున్నారు. ఇందు కోసం మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కారణంగా మీ గోళ్ళపై తెల్లటి గీతలు కూడా కనిపిస్తాయి.
వీటి వల్ల గోళ్లు పెరగడం, సన్నబడడం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. పారిశ్రామిక ప్రాంతంలో పని చేయడం వల్ల చాలాసార్లు గోళ్లపై తెల్లటి మచ్చలు వస్తాయి. వాస్తవానికి వీటిలో థాలియం, ఆర్సెనిక్ వంటి విషపూరిత లోహాలు ఉన్నాయి. ఇవి కాకుండా కాలేయం లేదా రక్తహీనత వంటి వ్యాధులు కూడా గోర్లు తెల్లబడటానికి కారణం కావచ్చంటున్నారు నిపుణులు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 ధృవీకరించడం లేదు. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి