రాత్రి భోజనం తర్వాత ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..! చాలా సమస్యలు ఎదుర్కొంటారు..!

ప్రస్తుత రోజుల్లో చాలా మందికి రాత్రిపూట అజీర్తి, గ్యాస్, యాసిడ్ వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇవి తినే విధానం కంటే తిన్న తర్వాత పాటించే అలవాట్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. రాత్రి భోజనం అనంతరం పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి భోజనం తర్వాత ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..! చాలా సమస్యలు ఎదుర్కొంటారు..!
Night Meal Mistakes

Updated on: Apr 10, 2025 | 12:47 PM

ప్రస్తుత జీవన విధానంలో చాలా మందికి జీర్ణ సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట భోజనం చేసిన తర్వాత కొన్ని తప్పిదాలు వల్ల అజీర్తి, పేగుల సమస్యలు, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి ఇబ్బందులు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే భోజనం తర్వాత కొన్ని సులభమైన అలవాట్లు పాటించడం మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రి భోజనం చేసిన వెంటనే కుర్చీలో కూర్చోవడం లేదా మంచంపై పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. భోజనం తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు మెల్లగా నడవడం మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది.

ఆహారం తిన్న అనంతరం గోరువెచ్చటి నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సజావుగా పని చేస్తుంది. వేడి నీరు శరీరంలోని వాయువు, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఇది టాక్సిన్లను బయటకు తీసి శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది.

చాలా మంది భోజనం చేసిన వెంటనే పడుకోవడం చేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి హానికరం. తిన్న వెంటనే పడుకుంటే యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య రాగలదు. కనీసం 30 నిమిషాల గ్యాప్ తర్వాతే నిద్రపోవడం మంచిది.

డీప్ బ్రీతింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి శరీరానికి సరిపడిన ఆక్సిజన్ అందుతుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అలాగే మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది.

సోంపు గింజలు రుచి మెరుగుపరచడమే కాదు.. జీర్ణక్రియలో కూడా చాలా మేలు చేస్తాయి. భోజనం తర్వాత కొన్ని సోంపు గింజలు నమలడం వల్ల అజీర్తి, వాంతులాంటి సమస్యలు దూరమవుతాయి.

రాత్రిపూట భోజనం అనంతరం మృదువైన వ్యాయామాలు చేయడం వల్ల శరీరం హాయిగా ఉంటుంది. ప్రత్యేకంగా చేతులు, కాళ్లు వంచే తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు శరీరంలో ఒత్తిడిని తగ్గించి మెరుగైన నిద్రకు సహాయపడుతాయి.

భోజనంలో ప్రొబయోటిక్స్ అయిన పెరుగు లేదా మజ్జిగను చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన గుడ్ బ్యాక్టీరియా అందుతుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఒక కప్పు గ్రీన్ టీ లేదా చమోమిలే టీ వంటి హెర్బల్ టీలు రాత్రిపూట తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుంది. ఇవి ఒత్తిడిని తగ్గించి నిద్ర నాణ్యతను పెంచుతాయి.

భోజనం సమయంలో నిటారుగా కూర్చోవడం చాలా ముఖ్యం. అలాగే తిన్న తర్వాత కొంతసేపు నిటారుగా కూర్చుని ఉండటం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఇది యాసిడ్ సంబంధిత సమస్యలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఈ చిన్న చిట్కాలు ప్రతి ఒక్కరూ పాటిస్తే రాత్రిపూట వచ్చే అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ అలవాట్లను నిత్యం పాటించండి.