Cholesterol: శరీరంలో కొలస్ట్రాల్ అనేది ఒక జిగట లాంటి పదార్థం. ఇది ఎక్కువైతే గుండె జబ్బులు, మెదడు సమస్యలు తలెత్తుతాయి. కొలస్ట్రాల్ అంత సులువుగా కరగదు. ఇది రక్తనాళాలలో పేరుకుపోతుంది. దీని వల్ల శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగదు. ఈ పరిస్థితిలో గుండె, మెదడు సమస్యలు మొదలవుతాయి. కాబట్టి కొలస్ట్రాల్ అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిందని చెప్పే లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.
1. శ్వాస ఆడకపోవడం, ఛాతి నొప్పి
మీరు కొద్దిసేపు నడిచిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, ఛాతీలో నొప్పిగా అనిపిస్తే అది శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి సంకేతమని చెప్పవచ్చు. రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరగనప్పుడు గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో ఛాతీ నొప్పి, అలసట లేదా శ్వాసలోపం ఉంటుంది.
2. బీపీ పెరిగి చెమటలు పట్టడం
బీపీ అకస్మాత్తుగా పెరిగినట్లయితే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ టెస్ట్‌ని చేయించుకోవాలి. అంతేకాకుండా చెమట ఎక్కువగా పడుతున్నట్లయితే కొలస్ట్రాల్ పెరిగిందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
3. కాళ్లలో వాపులు
కాళ్లలో వాపు, నొప్పి, తిమ్మిర్లు అధిక కొలెస్ట్రాల్ లక్షణంగా పరిగణిస్తారు. మీకు ప్రతిరోజూ ఇలాంటి సమస్య ఎదురవుతున్నట్లయితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి.
4. కొలెస్ట్రాల్ టెస్ట్
సాధారణంగా కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్ HDL, రెండోది చెడు కొలెస్ట్రాల్ LDL. మంచి కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మన కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్‌ను నివారించడంలో సహాయపడుతుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ అధిక BP, గుండె జబ్బులకు కారణమవుతుంది. శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్ స్థాయి 200 mg/dl కంటే తక్కువగా ఉండాలి. ఇది LDL 100 mg/dl కంటే తక్కువ, HDL 60 mg/dl కంటే ఎక్కువ, ట్రైగ్లిజరైడ్ 150 mg/dl కంటే తక్కువగా ఉండాలి.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి