సాధారణంగా యాంజియోగ్రామ్ రక్తనాళాల పనితీరుని తెలుసుకునేందుకు చేస్తారు. ఏ అవయవానికి సంబంధించిన రక్తనాళాలనైనా పరీక్షించవచ్చు. గుండె రక్తనాళాలను పరీక్షిస్తే దానిని కరోనరీ యాంజియోగ్రామ్ అంటారు. అదే మెదడుకు చేస్తే సెరిబ్రల్ యాంజియోగ్రామ్ అంటారు. గుండె పనితీరుపై ఏమైనా అనుమానాలు ఉంటే మొదట CT యాంజియోగ్రామ్ నిర్వహిస్తారు. ఈ రిపోర్టులో ఏమైనా లక్షణాలు కనిపిస్తే మరింత మెరుగైన ఫలితాల కోసం కరోనరీ యాంజియోగ్రామ్ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో చేతి ద్వారా చిన్న పరికరాన్ని గుండె రక్తనాళాల వరకు పంపుతారు. అందులో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది గుర్తిస్తారు. ఎలాంటి సమస్య లేకపోతే వెంటనే డిశ్చార్జ్ చేస్తారు. ఒక వేళ బ్లాక్స్ గుర్తిస్తే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి….
గుండెకు సంబంధించి ప్రధానంగా 3 రక్తనాళాలు ఉంటాయి. ఇందులో 70 శాతం లోపు బ్లాక్స్ ఉంటే మెడిసిన్‌తో క్యూర్ చేయవచ్చు. 70 శాతం కన్నా ఎక్కువగా ఉంటే స్టంట్ వేస్తారు.. 3 రక్తనాళాల్లోనూ బ్లాక్‌లు ఎక్కువగా ఉంటే అప్పుడు బైపాస్ సర్జరీ చేస్తారు. జనరల్‌గా…గుండె పనితీరుని తెలుసుకునేందుకు ECG, ఈకో పరీక్షలు చేస్తారు.. ఇవి ప్రాథమిక టెస్టులు. ఇందులో డౌట్ ఉంటే CT యాంజియోగ్రామ్.. అందులోనూ ఇబ్బందులు గుర్తిస్తే కరోనరీ యాంజియో గ్రామ్ చేస్తారు…
ఈ మధ్య కోవిడ్ వచ్చిన కోలుకున్న వారిలో రక్తం గడ్డ కట్టడం అనే సమస్యను ప్రధానంగా గుర్తిస్తున్నారు. గుండె కండరాలు కూడా వీక్ అవుతున్నట్లు తేలింది. కరోనా సోకిన టైమ్‌లో సరైన ఆహారం తీసుకోకపోయినా.. ఎక్సైర్‌సైజ్ చేయకపోయినా… ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనైనా…గుండె సంబంధిత సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కోవిడ్ రిస్క్ ఫ్యాక్టర్స్‌లో ఇది ఒకటి. అంతే తప్ప కోవిడ్ వల్లే గుండె జబ్బులు వస్తాయని అనుకోవడం పొరపాటని చెబుతున్నారు వైద్యులు. మిగతా రిస్క్ ఫ్యాక్టర్లకు కోవిడ్ కూడా తోడవుతుందని అంటున్నారు.
Also Read: CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదాలో వైద్య పరీక్షలు