ఈ రోగం మనకు తెలియకుండానే కాటేస్తుంది.. ఇలాంటి లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు..

భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫ్యాటీ లివర్ వ్యాధి కేసులు భారీగా పెరుగుతున్నాయి. చాలా సందర్భాలలో, ఫ్యాటీ లివర్ ప్రారంభ లక్షణాలు గుర్తించబడవు.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాధి తీవ్రమయ్యే అవకాశం పెరుగుతుంది.. కొన్ని సార్లు వైద్య అత్యవసర పరిస్థితి కూడా ఏర్పడవచ్చు..

ఈ రోగం మనకు తెలియకుండానే కాటేస్తుంది.. ఇలాంటి లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు..
Early Fatty Liver Symptoms

Updated on: Jun 05, 2025 | 11:43 AM

భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫ్యాటీ లివర్ వ్యాధి కేసులు భారీగా పెరుగుతున్నాయి. చాలా సందర్భాలలో, ఫ్యాటీ లివర్ ప్రారంభ లక్షణాలు గుర్తించబడవు.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాధి తీవ్రమయ్యే అవకాశం పెరుగుతుంది.. కొన్ని సార్లు వైద్య అత్యవసర పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.. ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం.. చాలా మందిలో దీని లక్షణాలను త్వరగా గుర్తించలేము.. కానీ కొన్నిసార్లు కడుపు నొప్పి, నీరసం, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కాలేయం వాపుకు.. మచ్చలకు దారితీస్తుంది.. ఇది తీవ్రమైన సందర్భాల్లో కాలేయ వైఫల్యానికి దారితీయవచ్చు.

అయితే.. ఫ్యాటీ లివర్ ను రెండు రకాలుగా విభజిస్తారు.. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD).. ఇది ఆల్కహాల్ తక్కువగా తీసుకోవడం లేదా తాగని వారిలో కనిపిస్తుంది.. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్.. ఇది అధికంగా ఆల్కహాల్ తాగేవారిలో కనిపిస్తుంది. ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక ఆల్కహాల్ వినియోగం, కొన్ని రకాల మందులు దీనికి ప్రధాన కారణం..

ఫ్యాటీ లివర్ అనేది ఒక వ్యాధి.. కావున దీని ప్రారంభ లక్షణాలను తెలుసుకోవాలి. మీకు కడుపులో కుడి వైపున నొప్పి ఉండి, అది చాలా కాలం పాటు కొనసాగితే, అది ఫ్యాటీ లివర్ లక్షణం కావచ్చు. దీనిని విస్మరించకూడదంటున్నారు వైద్య నిపుణులు..

ఫ్యాటీ లివర్ యొక్క ప్రారంభ లక్షణాల గురించి మాట్లాడుకుంటే.. మొదట మీకు కడుపులో కుడి ఎగువ భాగంలో నొప్పి అనిపించవచ్చు. ఇది ప్రారంభంలో తేలికగా ఉంటుంది. కాలేయంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడం వల్ల వాపు వస్తుంది.. దీనివల్ల కడుపులో కుడి ఎగువ భాగంలో తేలికపాటి లేదా మితమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి నిరంతరం కొనసాగవచ్చు లేదా అప్పుడప్పుడు పెరుగుతుంది. కొన్నిసార్లు సూది గుచ్చినట్లుగా నొప్పి కూడా అనిపించవచ్చు.

మీ ఆకలి తగ్గిపోయి, మునుపటితో పోలిస్తే బరువు తక్కువగా ఉంటే.. ఇది ఫ్యాటీ లివర్ లక్షణం కావచ్చు. ఫ్యాటీ లివర్ జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఆకలి తగ్గుతుంది. దీనితో పాటు, బరువు తగ్గడం కూడా ఉండవచ్చు.. కానీ ఈ లక్షణం అందరికీ కనిపించదు.

కొంతమందిలో ఫ్యాటీ లివర్ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. శరీరంలో బిలిరుబిన్ పెరుగుదల వల్ల చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. ఇది లివర్ హెపటైటిస్ ప్రారంభ లక్షణం కావచ్చు. దీనిని విస్మరించకూడదు.

కొవ్వు కాలేయం (ఫ్యాటీ లివర్) కొంతమంది శరీరంలో ద్రవ సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీని వలన కాళ్ళలో వాపు వస్తుంది. ఒక వ్యక్తి కాళ్ళలో వాపు ఉండి.. అది సుధీర్ఘకాలంపాటు కొనసాగితే, ఈ సందర్భంలో వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..