Weightloss Tips: బరువు తగ్గడం చాలా కష్టమైన పని. ఇందుకోసం వివిధ వ్యాయామాలు, మంచి ఆహారం, ధ్యానం, జాగింగ్ మొదలైన వాటిని ప్రయత్నిస్తారు. అదేవిధంగా బరువు తగ్గడం కోసం చాలామంది ఇష్టమైన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. ఇంకొందరు పూర్తిగా నోరు కట్టేసుకుంటారు. అయితే వీటివల్ల బరువు తగ్గకపోగా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే తరచూ కొన్ని ఆహార పదార్థాల క్యాలరీలు, న్యూట్రిషన్ మీటర్ గురించి తెలుసుకుంటే సులభంగా బరువు తగ్గచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.
సీజనల్ ఫ్రూట్స్
సీజన్‌లో లభించే అన్ని పండ్లలోనూ పోషకాలు ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని, పోషణకు సహాయపడతాయి. తాజా పండ్లలోకి జున్ను లేదా ఇతర తృణధాన్యాలు జోడించవచ్చు.
నట్స్
నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్‌లు పుష్కలంగా ఉంటాయి. మీరు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. వాల్‌నట్‌లు, బాదం పప్పులు,వేరుశెనగలు, పిస్తాపప్పులు బాగా తినవచ్చు.
ఓట్స్
ఓట్ బ్రాన్‌లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. దానితో పాటు తక్కువ కొవ్వు పాలు, పండ్లు జోడించాలి.
పెరుగు
పెరుగు అనేది తేలికైన, క్యాలరీలు లేని అలాగే రుచికరమైన చిరుతిండి. దీనిని అదనపు రుచి కోసం గింజలు, తాజా పండ్లతో కలిపి తీసుకోవచ్చు.
చిక్‌పీస్
చిక్‌పీస్ ప్రోటీన్‌ల పవర్‌హౌస్, సూపర్ టేస్టీ కూడా. వాటిని కొద్దిగా ఉప్పు, మిరియాలతో కలిపి కాల్చి తీసుకోవచ్చు. ఆకలిగా ఉన్నప్పుడల్లా తీసుకుంటే శరీరానికి మేలు చేకూరుతుంది.
పాప్‌కార్న్
ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. గ్లూటెన్ రహిత అల్పాహారం కావాలనుకుంటే, ఇంట్లో పాప్‌కార్న్‌ను తయారు చేసుకుని తినవచ్చు.
అవకాడో
అవి కాలానుగుణంగా ఉంటాయి. అలాగే టేస్టీగానూ ఉంటాయి. అవోకాడోలను ఉల్లిపాయలు, టొమాటోలు, లైమ్ జ్యూస్‌తో కలిపి తీసుకోవచ్చు.
పీనట్ బటర్
ఇది ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. అలాగే మీకు తక్షణ శక్తిని ఇస్తుంది.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..