AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.? బెల్లం తినండి చాలు..

బెల్లంను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కొవ్వును కరిగించుకోవచ్చు. ఈ విషయాన్ని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్టు చుట్టూ పేరుకుపోయే కొవ్వును కరిగించడంలో బెల్లం ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పంచదార తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. కానీ సహజసిద్ధమైన బెల్లం తింటే మాత్రం కొవ్వు కరుగుతుందని నిపునులు చెబతున్నారు. బెల్లంలోని పొటాషియం, ఐరన్‌, మెగ్నీషియం...

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా.? బెల్లం తినండి చాలు..
శీతాకాలంలో బెల్లంతో తయారు చేసిన ఆహారాలు తింటే అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. బెల్లం చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తులను కాలుష్యం నుంచి రక్షిస్తుంది. బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
Narender Vaitla
|

Updated on: Oct 21, 2023 | 4:49 PM

Share

చలికాలంలో సహజంగానే తీసుకునే ఆహారంలో మోతాదు పెరుగుతుంది. బయట వాతావరణం చల్లగా ఉంటే వేడి వేడిగా మిర్చీలు, బజ్జీలను లాగించేస్తుంటాం. దీంతో సహజంగానే బరువు పెరుగుతాం. నూనెతో చేసిన స్నాక్స్‌ తినగానే శరీరంలో కొవ్వు ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇక స్వీట్స్‌ తీసుకుంటే కూడా బరువు పెరుగుతామని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక స్వీట్‌ మాత్రం శరీరంలో కొవ్వును దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అదే బెల్లం. అవును బెల్లంను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కొవ్వును కరిగించుకోవచ్చు. ఈ విషయాన్ని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్టు చుట్టూ పేరుకుపోయే కొవ్వును కరిగించడంలో బెల్లం ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పంచదార తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. కానీ సహజసిద్ధమైన బెల్లం తింటే మాత్రం కొవ్వు కరుగుతుందని నిపునులు చెబతున్నారు. బెల్లంలోని పొటాషియం, ఐరన్‌, మెగ్నీషియం, పాస్పరస్ వంటి ఖనిజాలు శరీరానికి మేలు చేస్తాయి. అలాగే బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ పొట్టలోని కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి..

బెల్లంతో కలిగే మరిన్ని ప్రయోజనాలు..

* బెల్లం పొటాషియంకు పెట్టింది పేరనే విషయం తెలిసిందే. ఈ పొటాషియం జీవక్రియ రేటు మెరుగుపడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పొటాషియం కార్బోహైడ్రేట్లను శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శరీరంలో అదనంగా ఉన్న కేలరీలను ఖర్చు చేయడంలో బెల్లం ముఖ్య పాత్ర పోషిస్తుంది.

* బెల్లంలో ఫైబర్‌ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలోని ఫైబర్‌ కారణంగా పొట్ట త్వరగా నిండిన భావన కలిగేలా చేస్తుంది. దీంతో బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. ఇక బెల్లాన్ని క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల మల బద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

* బెల్లంలో ఐరన్‌ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం అంతటా ఆక్సిజన్‌ రవాణా కావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో శరీరంలోని ప్రతీ అవయవానికి ఆక్సిజన్‌ అందుతుంది. శక్తి స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

* శుద్ధి చేసిక చక్కెర కంటే బెల్లంలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. దీంతో బెల్లం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు. ఇది ఇన్సులిన్ నిరోధకతను నిరోధించడంలో సహాయపడుతుంది.

* బెల్లం ఒక న్యాచురల్‌ డిటాక్సిఫైయర్‌గా పని చేస్తుంది. శరీరంలోని విషాన్ని తొలగించడంలో బెల్లం ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది శరీరం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..