Health Tips: విటమిన్ బి-12 లోపిస్తే చాలా ప్రమాదం.. డైట్‌లో ఈ ఆహారాలను చేర్చుకోండి..!

|

May 07, 2022 | 3:16 PM

Health Tips: శరీరం ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలంటే చాలా పోషకాలు అవసరం. వీటిలో అనేక రకాల విటమిన్లు, ఫైబర్, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్, పిండి

Health Tips: విటమిన్ బి-12 లోపిస్తే చాలా ప్రమాదం.. డైట్‌లో ఈ ఆహారాలను చేర్చుకోండి..!
Vitamin B 12
Follow us on

Health Tips: శరీరం ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలంటే చాలా పోషకాలు అవసరం. వీటిలో అనేక రకాల విటమిన్లు, ఫైబర్, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్, పిండి పదార్థాలు అవసరం. ఇందులో విటమిన్ B-12 మన శరీరానికి చాలా ముఖ్యమైన విటమిన్‌. ఇది శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కళ్ల సంరక్షణ కోసం వైద్యులు ఈ విటమిన్ తినాలని సూచిస్తారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో ఇది లోపిస్తే ఆకలి లేకపోవడం, శరీరంలో బలహీనత, రక్తహీనత, చిరాకు, జలదరింపు, జుట్టు రాలడం, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడుతాయి. విటమిన్ B12 ను కోబాలమిన్ అని కూడా అంటారు. వాస్తవానికి ఇది నాన్ వెజ్ లాంటి వాటిల్లోనే ఎక్కువగా దొరుకుతుంది అందుకే వెజిటేరియన్స్‌లో తరచగా కొరవడుతోంది. అయినప్పటికీ కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా దీని లోపాన్ని తీర్చవచ్చు. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.

1. సోయాబీన్

మీరు గుడ్లు లేదా ఇతర నాన్-వెజ్ సంబంధిత వస్తువులను తినలేకపోతే బదులుగా సోయాబీన్స్ తినండి. ఇందులో విటమిన్ బి-12 పుష్కలంగా లభిస్తుంది. మీరు సోయాబీన్ కూరగాయలు, సోయా పాలు లేదా సోయాబీన్ నూనెను ఆహారంలో చేర్చుకోవచ్చు. సోయాబీన్స్‌లో ప్రోటీన్ కూడా ఎక్కువగా లభిస్తుంది.

2. ఓట్స్

శాకాహారులని ఆరోగ్యంగా ఉండడంతో పాటు టేస్టీగా ఏదైనా తినాలనుకుంటే ఓట్స్‌ని ప్రయత్నించవచ్చు. ఇందులో విటమిన్ బి-12 సరైన మోతాదులో ఉంటుంది. మీరు దీంతో కూరగాయల సూప్‌ని కూడా తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యంగా, రుచిగా ఉండటంతో పాటు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

3. పన్నీరు

పన్నీరులో విటమిన్ B-12తో పాటు ప్రోటీన్, కాల్షియం పెద్ద మొత్తంలో ఉంటుంది. విటమిన్ బి-12 లేకపోవడం వల్ల ఎముకల పెలుసుబారిపోతాయి. నొప్పులు మొదలవుతాయి. అందుకే పన్నీరు తీసుకుంటే ఈ లోపాన్ని సరిచేయవచ్చు. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

4. పుట్టగొడుగు

ఇది విటమిన్ B-12 ఉత్తమ మూలంగా చెప్పవచ్చు. పుట్టగొడుగుల్లో విటమిన్ బి-12తో పాటు ప్రొటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. మీరు మీ ఆహారంలో భాగంగా పుట్టగొడుగుల నుంచి రుచికరమైన కూరగాయలను తయారు చేసుకోవచ్చు.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Bill Gates: కరోనా తర్వాత ఇప్పుడు మరో మహమ్మారి.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ హెచ్చరిక..!

Health Tips: మోకాళ్ల నొప్పిని తట్టుకోలేకపోతున్నారా.. ఈ 5 ఆహారాలని డైట్‌లో చేర్చండి..!

Health Tips: ఉదయాన్నే చేసే ఇలాంటి పొరపాట్లు ఎసిడీటీకి కారణమవుతాయి.. అవేంటంటే..?