Health: ఈ చుక్కల మందుతో కళ్ల జోడు అవసరమే లేదు.. ఆమోదించిన అమెరికా.. కానీ వైద్యులు ఏమంటున్నారంటే..

|

Jul 15, 2022 | 1:51 PM

Helath: కాలక్రమేణ కంటి చూపు తగ్గడం సర్వసాధారణమైన విషయం. అయితే మారుతోన్న జీవన విధానం, పెరుగుతోన్న ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ల వినియోగంతో చిన్న వయసులోనే కంటి చూపు సమస్యతో బాధపడుతోన్న వారి సంఖ్య...

Health: ఈ చుక్కల మందుతో కళ్ల జోడు అవసరమే లేదు.. ఆమోదించిన అమెరికా.. కానీ వైద్యులు ఏమంటున్నారంటే..
Follow us on

Helath: కాలక్రమేణ కంటి చూపు తగ్గడం సర్వసాధారణమైన విషయం. అయితే మారుతోన్న జీవన విధానం, పెరుగుతోన్న ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ల వినియోగంతో చిన్న వయసులోనే కంటి చూపు సమస్యతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో పదేళ్లు కూడా నిండక ముందే కళ్ల జోడ్లు ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తోంది. దృష్టిలోపంతో బాధపడేవారు అయితే లేజర్‌ సర్జరీకి వెళ్తారు, లేదా కళ్ల జోడ్లను ధరిస్తారు. అయితే తాజాగా అమెరికాలో తయారు చేసిన ఓ ఐ డ్రాప్స్‌తో దృష్టి లోపం ఉన్న వారు కళ్ల జోడ్లను ఉపయోగించాల్సిన అవసరమే ఉండదు. Vuity పేరుతో రూపొందించిన ఈ చుక్కల మందుతో దృష్టి సమస్యలకు క్షణాల్లో చెక్‌ పెట్టొచ్చు. తాజాగా యూనైటెడ్‌ స్టేట్స్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (USFDA) ఇటీవల ఈ చుక్కల మందు వినియోగానికి అనుమతులు ఇచ్చింది. ఈ ఐ డ్రాప్‌తో కళ్ల జోడ్లను ఉపయోగించాల్సిన అవసరమే ఉండదని చెబుతున్నారు. ఇంతకీ ఈ ఐ డ్రాప్స్‌ ఎలా పనిచేస్తాయి.? వీటివల్ల ఏమైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయా.? లాంటి విషాయలను ప్రముఖ వైద్యులు టీవీ9తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు..

న్యూఢిల్లీలోని నెప్ట్యూన్‌ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ కంటి శస్ర్తచికిత్స వైద్యుడు డాక్టర్‌ విశ్వనాథ్‌ గోపాల్‌ మాట్లాడుతూ..’తాజాగా రూపొందించిన ఈ ఐ డ్రాప్స్‌లో పిల్కోర్పిన్‌ అనే రసాయనం ఉంటుంది. ఇది దృష్టిలోపంతో బాధపడుతున్న వారికి ఉపయోగపడుతుంది. సాధారణంగా 40 ఏళ్ల తర్వాత తలెత్తే దృష్టిలోపాలకు దీనితో చెక్‌ పెట్టొచ్చు’ అని తెలిపారు. గ్లాకోమా చికిత్స విధానంలో ఈ పిల్కోర్పిన్‌ను గత 60 ఏళ్లుగా ఉపయోగిస్తున్నారని తెలిపిన గోపాల్‌.. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కంటి చుక్కలు కంటి చికిత్సలో ముందడుగే అయినప్పటికీ.. లాసిక్‌ సర్జరీకి ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం కాదని తేల్చి చెప్పారు.

ఇక ఇదే విషయమై ఫార్టిస్‌ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్‌ నీతూ శర్మ మాట్లాడుతూ.. ‘ఈ ఐ డ్రాప్స్‌ సమస్యను శాశ్వతంగా పరిష్కరించవు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రగ్‌ కంటికి తిరిగి పూర్వపు శక్తిని ఇవ్వలేదు. కేవలం కొద్ద కాలంపాటు స్పష్టమైన చూపు కనిపించేలా మాత్రమే చేయగలవు. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాద’ని చెప్పుకొచ్చారు. ఇక ఈ డ్రగ్‌ను ఇప్పటికే గ్లాకోమా రోగులకు పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. పిలోకార్పిన్‌ ఉపయోగించడం వల్ల తలనొప్పి, కళ్లు మండడం, ఎర్రబడడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నీతూ శర్మ తెలిపారు. అంతేకాకుండా కంటి శుక్లం సమస్యతో బాధపడుతోన్న వారిపై ఈ ఐ డ్రాప్స్‌ దుష్ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అమెరికాలో దీనికి అనుమతులు లభించినా.. కొన్నేళ్ల వాడకం తర్వాతే దీని పనితీరుపై ఓ అంచనాకు రావాలని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

ఇంతకీ డ్రాప్స్‌ ఎలా పని చేస్తాయి, అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..

ఈ ఐ డ్రాప్స్‌ 40 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండి.. ఫోన్‌లో, పేపర్‌పై అక్షరాలు కనిపించని వారికి ఈ ఐ డ్రాప్స్‌ ఉపయోగపడతాయి. వీటిని కేవలం రోజుకి ఒక డ్రాప్‌ మాత్రమే వేసుకోవాలి. వేసుకున్న 15 నిమిషాల్లోనే దీని పనితీరు ప్రారంభమవుతుంది. ఈ డ్రగ్ ప్రభావం సుమారు 6 గంటలపాటు పనిచేస్తుంది. కంటిలోని పీహెచ్‌ స్థాయిలను వీలైనంత వేగంగా సర్దుబాటు చేయడానికి పరిశోధకులు ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించారు. పరిశోధకులు ఈ ఐ డ్రాప్‌ అనుమతులు ఇచ్చే ముందు ఓ అధ్యయాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా దృష్టి లోపంతో బాధపడుతోన్న 40 నుంచి 55 ఏళ్ల మధ్య 750 మందిని పరిగణలోకి తీసుకున్నారు. వీరిలో సగం మందికి ఈ కొత్త ఐ డ్రాప్స్‌ను ఉపయోగించగా, ఇతరులకు ప్లకెబో ఐ డ్రాప్‌లను వాడారు. ఈ మెడిసిన్‌ పనితీరు కేవలం 15 నిమిషాల్లో ప్రారంభమైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. క్లినికల్ స్టడీస్‌లో భాగంగా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ను పరిశోధకులు గుర్తించలేదు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..