Type 2 Diabetes: ఆక్యుపంక్చర్ థెరపితో డయాబెటిస్ అదుపులో.. తాజా పరిశోధనలలో సరికొత్త విషయాలు
Type 2 Diabetes: ప్రస్తుతం డయాబెటిస్ రోగుల సంఖ్య పెరిగిపోతోంది. జీవన శైలిలో మార్పులు,ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు, వంశపారంపర్యంగా చాలా మంది మధుమేహం..
Type 2 Diabetes: ప్రస్తుతం డయాబెటిస్ రోగుల సంఖ్య పెరిగిపోతోంది. జీవన శైలిలో మార్పులు,ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు, వంశపారంపర్యంగా చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఎంతో మందిని డయాబెటిస్ వెంటాడుతోంది. అయితే జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు తప్పా.. పూర్తిగా నివారించలేము. ఇక తాజాగా ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధనా బృందం ఓ అధ్యయనం చేపట్టింది. ఆక్యుపంక్చర్ థెరపీ సహాయంతో టైప్ 2 డయాబెటిస్‌ను నివారించవచ్చని కొత్త అధ్యయనం కనుగొంది. ఈ పరిశోధనలలో 3,600 మందికి పైగా ప్రీడయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులపై ఆక్యుపంక్చర్ ప్రభావం ఏ విధంగా ఉంటుందనే దానిపై అధ్యయనం కొనసాగింది. ఇందులో మధుమేహం అని నిర్ధారించబడేంత ఎక్కువగా ఉండకుండా రక్తంలో సాధారణ గ్లూకోజ్ స్థాయిలున్నట్లు గుర్తించారు.
ఆక్యుపంక్చర్ థెరపీ వల్ల మధుమేహం ఉన్నవారిలో మంచి ఫలితాలు వచ్చినట్లు పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రీడయాబెటిస్ సంభవం గణనీయంగా తగ్గినట్లు పరిశోధనలో వెల్లడైంది. పరిశోధకుడు మిన్ జాంగ్ మాట్లాడుతూ, ఇది మధుమేహం నుండి బయటపడటానికి కీలకంగా మారనుందని తెలిపారు. ఆక్యుపంక్చర్ థెరపీ మధుమేహం ఉన్నవారికి ఎంతో ఉపయోగపడనుందని అన్నారు. ఇది ప్రపంచంలోని వయోజన జనాభాలో 11 శాతం మందిని ప్రభావితం చేస్తుందని అంచనా వేయబడిందని అన్నారు. 2045 నాటికి దాదాపు 1.3 బిలియన్ల మందికి మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ ఉంటుందని ది ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అంచనా వేసింది.
ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో 93 శాతం మంది 20 సంవత్సరాలలో టైప్ 2 డయాబెటిస్ బారిన పడతారని అన్నారు. కానీ మధుమేహంలాగా కాకుండా మెరుగైన ఆహారం లేని కారణంగా, అలాగే సరైన వ్యాయామం లేకపోవడం ప్రీడయాబెటిస్ తిరగబడుతుంది. అయితే డయాబెటిస్ రోగులకు ఆక్యుపంక్చర్ ఎంతగానో దోహదపడనుందని తెలిపారు.
మధుమేహం తరచుగా జీవనశైలి కారకాలతో ముడిపడి ఉన్నప్పటికీ, జీవితంలోని ఇతర అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. మీరు నిద్ర సమస్యలు, అధిక రక్తపోటు, చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
మరిన్ని హెల్త్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి