Health Tips: కడుపులో గ్యాస్‌, ఉబ్బరంతో ఇబ్బంది పడుతున్నారా.. కిచెన్‌లో ఉండే ఈ పదార్థాలతో చక్కటి ఉపశమనం..!

|

May 13, 2022 | 6:32 AM

Health Tips: ఈ రోజుల్లో చాలామంది కడుపులో గ్యాస్‌, ఉబ్బరం సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమంది మహిళలు ఇతరులకన్నా

Health Tips: కడుపులో గ్యాస్‌, ఉబ్బరంతో ఇబ్బంది పడుతున్నారా.. కిచెన్‌లో ఉండే ఈ పదార్థాలతో చక్కటి ఉపశమనం..!
Gas And Bloating
Follow us on

Health Tips: ఈ రోజుల్లో చాలామంది కడుపులో గ్యాస్‌, ఉబ్బరం సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమంది మహిళలు ఇతరులకన్నా ఎక్కువగా బాధపడతారు. ఆహారంలో కొన్ని సాధారణ మార్పులు చేయడం వల్ల గ్యాస్ సమస్యకి ఉపశమనం దొరుకుతుంది. అయితే వాటికంటే కిచెన్‌లో దొరికే ఆయుర్వేద ఔషదాలని వాడటం వల్ల మంచి రిలీఫ్‌ ఉంటుంది. వాస్తవానికి జీర్ణాశయంలో గాలి చేరడం వల్ల గ్యాస్, ఉబ్బరం సమస్య ఏర్పడుతుంది. చాలా వేగంగా తినడం, ఆహారం సరిగ్గా నమలకపోవడం, చల్లని పానీయాలు తాగడం, కష్టంగా జీర్ణమయ్యే ఆహారాలు తినడం, హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల గ్యాస్‌ సమస్య ఏర్పడుతుంది. కానీ ఈ పదార్థాల ద్వారా గ్యాస్ సమస్యని తొలగించుకోవచ్చు.

యాలకులు

ప్రజలు యాలకులని చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. కడుపు సంబంధిత సమస్యలకి యాలకులు దివ్య ఔషధంగా చెప్పవచ్చు. యాలకులు గ్యాస్‌ను తగ్గించడమే కాదు తిమ్మిరి, వికారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. యాలకులు మీకు మంచి రుచిని అందించడంతో పాటు గ్యాస్ సమస్యను తొలగించడం ద్వారా పొట్టను క్లీన్ చేస్తాయి.

జీలకర్ర

మీ అన్నవాహికలో అడ్డంకులు ఉంటే మీరు తినే ఆహారానికి జీలకర్రని యాడ్‌ చేయాలి. జీలకర్ర ఆహార పైపును క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. తద్వారా మీ జీర్ణవ్యవస్థ గ్యాస్‌ సమస్యల నుంచి ఉపశమనం పొందుతుంది. దీన్ని మధ్యాహ్న భోజనం సమయంలో మజ్జిగలో కలుపుకొని తాగితే ఉబ్బరం సమస్య తొలగిపోతుంది.

సోంపు

మీకు మలబద్ధకం లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉంటే సోంపు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇది నొప్పి, మంట నుంచి మీకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది అపానవాయువు తొలగించడంలో సహాయపడుతుంది. అజీర్ణం, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి సోంపు ఉపయోగపడుతుంది. ప్రతిరోజు భోజనం తర్వాత సోంపు తింటే చాలా మంచిది.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Karate Kalyani youtuber: కరాటే కల్యాణి, యూట్యూబర్‌ మధ్య గొడవ.. ఒకరిపై ఒకరు దాడి..

K.A. Paul: కేంద్ర హోం మంత్రిని కలిసిన కేఏ పాల్.. జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించాలని వినతి..

CSK vs MI: ముంబై ఇండియన్స్‌ సూపర్ విక్టరీ.. చెన్నై ప్లే ఆఫ్‌ ఆశలు గల్లంతు..