చాలా వరకు పండ్ల(Fruits) తొక్కలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. వాటిని ఏదో విధంగా వాడుకోవచ్చు. ముఖ్యంగా అరటిపండు అంటే చాలా మందికి ఇష్టమే ఉంటుంది. అన్నం తిన్న తరువాత అరటిపండు తినడం చేస్తుంటారు. అందుకే పెళిల్లలో చాలా చోట్ల అరటిపండు(Banana)ను పెడుతుంటారు. అయితే చాలామంది అరటిపండును తిని దాని తొక్క(Banana Peel)ను పారేస్తుంటారు. నిజానికి అరటి పండ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయో, వాటి వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో, వాటి తొక్క వల్ల కూడా మనకు అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అరటి పండు తొక్క ఎలా మనకు ఉపయోగపడుతుందో ఓ సారి చూద్దాం.
అరటి పండు తొక్కలో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని తగ్గిస్తాయి. దీంతోపాటు మూడ్‌ను మార్చి డిప్రెషన్‌ను తగ్గించే సెరొటోనిన్ అనబడే సమ్మేళనం కూడా అరటి పండు తొక్కలో ఉంటుంది. అందుకనే ఆ తొక్కను తినమని వైద్యులు సలహా సూచిస్తారు.
అరటిపండు తొక్కతో దంతాలను తోముకుంటే దంతాలు తెల్లగా మారుతాయట. దంతాలు, చిగుళ్ల సమస్యలు పోయి అవి దృఢంగా మారుతాయట. దీంతో పాటుగా నీటిలో ఉండే లోహాలను, ఇతర విషపదార్థాలను తొలగించడంలోనూ అరటి పండు తొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నీటిలో అరటి పండు తొక్కలను వేస్తే నీరు శుభ్రంగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
కాలిన గాయాలు, పుండ్లు, దెబ్బలపై అరటి పండు తొక్కతో మర్దన చేస్తే ఆయా గాయాలు త్వరగా తగ్గుముఖం పడతాయి. అరటిపండు తొక్కలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఆ తొక్కలను ముఖానికి మర్దన చేసినట్లు రాస్తే మొటిమల సమస్య తగ్గుతుంది. ముఖ సౌందర్యం పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
Read Also.. Cinnamon Benefits: ఆ పేషెంట్లకు దివ్యౌషధంగా దాల్చిన చెక్క.. ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో ప్రయోజనాలు