వయసు పెరుగుతున్నా బ్రెయిన్ చురుగ్గా ఉండాలంటే.. ఇవి తినాల్సిందే..!

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం చాలా అవసరం. శక్తినిచ్చే పోషకాలు, ఒమేగా 3, విటమిన్లు ఉండే పదార్థాలు మెదడును చురుకుగా ఉంచుతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవ్వాలంటే ఈ ఆహారాలను రోజూ తీసుకోవాలి. సరైన ఆహారం మెదడును యాక్టివ్‌ గా ఉంచి వయస్సుతో వచ్చే మతిమరుపుని తగ్గించగలదు.

వయసు పెరుగుతున్నా బ్రెయిన్ చురుగ్గా ఉండాలంటే.. ఇవి తినాల్సిందే..!
Healthy Brain

Updated on: Jul 26, 2025 | 7:47 PM

మెదడు ఆరోగ్యంగా పనిచేయాలంటే శక్తివంతమైన పోషకాలు ఉన్న ఆహారం తినడం చాలా ముఖ్యం. రోజూ మన భోజనంలో మెదడుకు అవసరమైన శక్తినిచ్చే పదార్థాలను చేర్చుకుంటే.. మెదడు చురుగ్గా, పర్ఫెక్ట్‌ గా పని చేస్తుంది. మెదడు పని చేయడానికి ఎనర్జీ కావాలి. దానికి కావాల్సిన శక్తిని మనం తినే ఆహారం ద్వారా పొందొచ్చు. నిండా పోషకాలున్న ఆహారం మెదడును శక్తివంతంగా పని చేసేలా చేస్తుంది.

కేవలం కండరాలకు మాత్రమే కాదు.. మన శరీరంలో ప్రతి భాగానికి, ముఖ్యంగా మెదడుకు, సరైన పోషణ చాలా అవసరం. ఆరోగ్యకరమైన మెదడు మన జ్ఞాపకశక్తిని, ఆలోచనా సామర్థ్యాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.

జింక్, విటమిన్ C, విటమిన్ K లాంటి పోషకాలు మెదడుకు చాలా హెల్ప్ చేస్తాయి. ఈ పోషకాలు ఉండే ఆహారాలను భోజనంలో చేర్చితే మెదడు ఫోకస్ పెట్టే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. ఇవి మెదడులోని నరాల కమ్యూనికేషన్‌ ను బలోపేతం చేసి సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేయడానికి సహాయపడతాయి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఫిష్ ఆయిల్, గుమ్మడి గింజలు, పప్పులు, కాలీఫ్లవర్, బ్రొకలీ లాంటి పదార్థాలు మెదడుకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా మెదడు కణాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి.

వెన్న, గుడ్లు, మునగాకు, మెంతికూర లాంటి ఆకుకూరలు, బ్రౌన్ రైస్, సంపూర్ణ ధాన్యాలు, సోయా లాంటి పదార్థాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి మెదడులోని న్యూరాన్ల మధ్య సంబంధాన్ని బలోపేతం చేసి జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెర్రీలు, డార్క్ చాక్లెట్ కూడా మెదడు కణాలను డ్యామేజ్ నుండి కాపాడతాయి.

వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో వచ్చే మార్పుల లాగే.. మెదడులో కూడా పనితీరు తగ్గే అవకాశం ఉంటుంది. దీని వల్ల మతిమరుపు, ఫోకస్ లోపం, ఎమోషన్స్‌ లో మార్పులు లాంటి సమస్యలు రావొచ్చు. సరైన పోషణ లేకపోతే ఈ సమస్యలు మరింత తీవ్రం కావచ్చు.

కాబట్టి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన పోషక పదార్థాలను రోజూ మన ఆహారంలో చేర్చుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా మెదడును చురుగ్గా ఉంచి అనేక ఏళ్ల పాటు దాని పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. కేవలం ఆహారమే కాకుండా.. తగినంత నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండటం, వ్యాయామం చేయడం కూడా మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)