Toned Milk or Normal Milk: టోన్డ్ మిల్క్ లేదా నార్మల్ మిల్క్… ఏది బెటర్? నిపుణులు ఏమంటున్నారు?

Healthy milk choice: బరువు తగ్గాలనుకునేవారికి ఏ పాలు మంచిదని చాలా మందిలో ఉండే సందేహం. కొందరు టోన్డ్ మిల్క్ మేలు అంటే.. మరికొందరు క్రీమ్ మిల్క్ బెటర్ అని అంటారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ పాలలో ఏ రకం పాలు తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మంచిది లేదా బరువు తగ్గాలనుకునేవారికి ఏ పాలు మంచివి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

Toned Milk or Normal Milk: టోన్డ్ మిల్క్ లేదా నార్మల్ మిల్క్... ఏది బెటర్? నిపుణులు ఏమంటున్నారు?
Toned Milk Or Normal Milk

Updated on: Jan 24, 2026 | 1:53 PM

Toned Milk Vs Normal Milk: సాధారణంగా పాలు ఆరోగ్యానికి మంచిదని అందరూ తాగుతుంటారు. ప్రస్తుతం పాలు వివిధ రకాలైన నాణ్యతలతో పాలు లభిస్తున్నాయి. దీంతో ఎవరికి కావాల్సినవి వారు తీసుకుంటున్నారు. కొందరు నార్మల్ పాలు తాగుతుంటే.. మరికొందరు టోన్డ్, క్రీమ్ పాలు తీసుకుంటున్నారు. అయితే, బరువు తగ్గాలనుకునేవారికి ఏ పాలు మంచిదని చాలా మందిలో ఉండే సందేహం. కొందరు టోన్డ్ మిల్క్ మేలు అంటే.. మరికొందరు క్రీమ్ మిల్క్ బెటర్ అని అంటారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ పాలలో ఏ రకం పాలు తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మంచిది లేదా బరువు తగ్గాలనుకునేవారికి ఏ పాలు మంచివి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

టోన్డ్ పాలు.. సాధారణ పాలు ఏదీ ఉత్తమం

టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, సీనియర్ డైటీషియన్ గీతికా చోప్రా బరువు తగ్గడానికి ఏ పాలు ఉత్తమమో వివరించారు. బరువు తగ్గడానికి సాధారణ పాల కంటే టోన్డ్ మిల్క్ మంచిదని స్పష్టం చేశారు. దీనికి శాస్త్రీయమైన కారణాలున్నాయని తెలిపారు. టోన్డ్ మిల్క్‌లో తక్కువ కొవ్వు శాతం అంటే 3 శాతం మాత్రమే ఉంటుంది. అయితే, సాధారణ పాలలో మాత్రం 67 శాతం కొవ్వు ఉంటుంది. తక్కువ కొవ్వు శాతం కారణంగా టోన్డ్ మిల్క్ తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు టోన్డ్ మిల్క్ తీసుకోవడం చాలా మంచిది.

బరువు తగ్గాలనుకునేవారికి టోన్డ్ మిల్క్ బెస్ట్

కొవ్వు శాతం తక్కువగా ఉన్నప్పటికీ.. టోన్డ్ పాలలో కండరాలు, జీవక్రియ, ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్, కాల్షీయం, విటమిన్లు దాదాపు అదే మొత్తంలో అందుతాయని వైద్యులు చెబుతున్నారు. నార్మల్ మిల్క్ ఎక్కువ సంతృప్త కొవ్వును అందిస్తాయని, అధికంగా తీసుకుంటే కొవ్వు నిల్వను పెంచుతాయని అంటున్నారు. చాలా చురుకుగా ఉన్న వ్యక్తులు ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవచ్చంటున్నారు. అయితే, బరువు తగ్గించాలనుకునేవారు మాత్రం టోన్డ్ పాలను రోజువారీ ఆహారంలో తీసుకోవడం ఉత్తమమైన ఎంపిక అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

ఎవరు పాలు తాగకూడదు.?

చాలా మంది పాలను జీర్ణించుకోలేరని మరో వైద్య నిపుణలు డాక్టర్ జుగల్ కిశోర్ తెలిపారు. పాలను జీర్ణం చేసుకోలేని వారికి.. లాక్టోస్ ఎలర్జీ ఉంటుందని చెప్పారు. ఎవరైనా నిరంతరం అజీర్ణం, యాసిడిటీ లాంటి సమస్యలతో బాధపడుతుంటే మాత్రం వారు పాలను తీసుకోవద్దని సూచిస్తున్నారు. పాల ఉత్పత్తులు కూడా వారు తీసుకోకూడదని చెబుతున్నారు. ల్యాబ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా మీకు లాక్టోస్ ఎలర్జీ ఉందో లేదో తెలుసుకోవచ్చని అంటున్నారు.