Toddler Skin Care: మీ పిల్లల మొఖంపై మచ్చలు వస్తున్నాయా? అయితే, ఈ విషయాలపై జాగ్రత్తగా ఉండండి..

|

Mar 26, 2022 | 7:29 AM

Toddler Skin Care: మారుతున్న వాతావరణం ప్రభావం మన ఆరోగ్యంపైనే కాదు చర్మంపై కూడా కనిపిస్తుంది. దీని ప్రభావం పెద్దలతో పాటు..

Toddler Skin Care: మీ పిల్లల మొఖంపై మచ్చలు వస్తున్నాయా? అయితే, ఈ విషయాలపై జాగ్రత్తగా ఉండండి..
Rashes
Follow us on

Toddler Skin Care: మారుతున్న వాతావరణం ప్రభావం మన ఆరోగ్యంపైనే కాదు చర్మంపై కూడా కనిపిస్తుంది. దీని ప్రభావం పెద్దలతో పాటు.. శిశువులపైనా చూపుతోంది. వాతావరణ మార్పుల కారణంగా చిన్న పిల్లల చర్మంపై అలెర్జీలు మొదలవుతుంది. చర్మంపై మంట, నొప్పి శిశువు ఆరోగ్య స్థితిని దిగజార్చుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శిశువు చర్మానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. వారు పాలు తాడం, తినడం మానేస్తారు. నిద్రకూడా సరిగాపోరు. చిరాకు పడుతుంటారు. శిశువు విషయంలో ఈ సమస్యల పట్ల జాగ్రత్త వహించాలి. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలి. స్కిన్ అలర్జీలు అనేక సమస్యలకు దారి తీస్తాయి. చిన్న పిల్లల చర్మం మరింత సున్నితంగా ఉంటుంది. వాతావారణంలో మార్పుల వల్ల పిల్లల బుగ్గలపై పగుళ్లు ఏర్పడటం సాధారణమే అయినప్పటికీ.. అది అలెర్జీ రూపంలో ఉంటే దానిని ఏమాత్రం విస్మరించొద్దు.

చలికాలంలో పుట్టిన నవజాత శిశువులకు వేసవి కాలంలో చెమట ఎక్కువగా పడుతుంటుంది. అది అలెర్జీకి దారి తీస్తుంది. శిశువు చర్మంపై అలెర్జీని గుర్తిస్తే.. ప్రత్యేక శద్ధ వహించాల్సి ఉంటుంది. శిశువుకు అలెర్జీ రాకుండా ఉండాలంటే వీటిని పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

నీటిలో ఎక్కువసేపు ఉంచవద్దు..
వేసవి కాలం, చల్లగా ఉంటే బాగుంటుందని బిడ్డను ఎక్కువ సేపు నీటిలో ఉంచుతుంటారు. కానీ అలా చేయడం పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల జలుబు అవుతుంది. అలాగే.. నీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారుతుంది. ప్రతిరోజూ శిశువుకు స్నానం చేయడం మంచిది. తక్కువ కాలంలో పూర్తి చేయాలి.

మసాజ్ చేయాలి..
వేసవిలో పిల్లలకి మసాజ్ చేయడం వల్ల చర్మ సమస్యల బారిన పడతారని చాలా మంది భావిస్తారు. కానీ, ఆ ఆలోచన చాలా తప్పు అని నిపుణులు చెబుతున్నారు. చలికాలం మాదిరిగానే, వేసవిలో కూడా శిశువుకు మసాజ్ చేయడం అవసరం. నూనెతో మసాజ్ చేయడం వల్ల బిడ్డ చర్మం మృదువుగా ఉంటుంది. చర్మానికి అవసరమైన తేమ అందుతుంది.

సహజ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించాలి..
బేబీ స్కిన్ కేర్ కోసం మార్కెట్‌లో చాలా రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే నేచురల్ ప్రొడక్ట్స్ వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో లభించే ఉత్పత్తుల్లో రసాయనాలు అధికంగా ఉంటాయి. అవి చర్మానికి హానీ తలపెడతాయి. శిశువు ముఖం, చర్మం తేమగా ఉండటానికి కొబ్బరి నూనెను ఉపయోగిస్తే మంచిదని చెబుతున్నారు నిపుణులు.

(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. TV9 తెలుగు వీటిని ధృవీకరించలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)

Also read:

Optical Illusion: మీ కళ్లకు అగ్నిపరీక్ష.. ఈ ఫోటోలో ఎంత మంది ఉన్నారో చెబితే మీరే జీనియస్..!

Viral Video: చేసిందంతా చేసి కుక్కను బలి చేసిన కంత్రీ పిల్లి.. వీడియో చూస్తే అవాక్కవుతారు..!

Astrology: వ్యక్తి ఎత్తును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..