Iron Rich Foods: ఆధునిక కాలంలో చాలామంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. రక్త హీనత సమస్య వల్ల పలు అనారోగ్య సమస్యలు కూడా వారిని వెంటాడుతున్నాయి. అయితే.. ఈ సమస్యను అధిగమించేందుకు పచ్చి కూరగాయలు, పోషకాహారం వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బచ్చలికూర, బ్రోకలీ వంటి కూరగాయల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ లోపాన్ని అధిగమించడానికి ఇంకా చాలా ఆహార పదార్థాలను తీసుకోవచ్చని సూచిస్తున్నారు. మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలలో ఐరన్ ఒకటి. ఇది మీ ఊపిరితిత్తుల నుంచి ఇతర అవయవాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లే హిమోగ్లోబిన్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఐరన్ లోపంతో మీ శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించదు.. మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట లాంటివి తలెత్తుతాయి. ఆరోగ్యకరమైన కణాలు, చర్మం, జుట్టు, గోర్లు ఇలా శరీర ఆరోగ్యంలో ఐరన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే ఇనుము అధికంగా (Iron Foods) ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ ఆహారాలు (Foods) ఏంటో ఇప్పుడు చూద్దాం..
గుడ్డు పచ్చసొన: గుడ్డులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే వీటిని అల్పాహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్లు మాత్రమే కాదు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. గుడ్డు పచ్చసొనలో దాదాపు 1.89 mg ఐరన్ ఉంటుంది. ఇది శరీర శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బ్రొకొలీ: గ్రీన్ వెజిటేబుల్ బ్రకోలీలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బ్రోకలీలో విటమిన్ సి, ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ కె, మెగ్నీషియం, జింక్, కాల్షియం, ఫాస్పరస్ వంటి కొన్ని ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. గుండెను.. రక్షించి ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త నాళాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతే కాకుండా ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
శనగలు: శనగల్లో అనేక విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి బరువును అదుపులో ఉంచుతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి.. అనేక అనారోగ్య సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అందుకే శనగలతో కూర వండుకోవడంతోపాటు సలాడ్‌లో కూడా భాగం చేసుకోవచ్చు.
బచ్చలికూర, పాలకూర: ఆకుకూరలో అనేక ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. USDA డేటా ప్రకారం.. సుమారు 100 గ్రాముల బచ్చలికూరలో 2.7 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. మీకు ఐరన్ లోపం ఉంటే.. మీ ఆహారంలో ఈ ఐరన్-రిచ్ బచ్చలికూరను చేర్చుకోవచ్చు.
గుమ్మడికాయ గింజలు: ఈ గింజలలో విటమిన్లు A, C, K, B9 వంటి ఇతర విటమిన్లు, పొటాషియం, మాంగనీస్, కాల్షియం వంటి ఖనిజాలు, ఐరన్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవి తింటే.. రక్త హీనత సమస్యను అధిగమించవచ్చు.
సోయాబీన్: ఐరన్ పుష్కలంగా ఉండే మరొక ఆహారం సోయాబీన్. ఇందులో ఐరన్, ప్రొటీన్, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణ సమస్యలను దూరం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
మాంసం: ఐరన్ అందే ఆహార పదార్థాల్లో మాంసం ఒకటి. క్రమం తప్పకుండా మాంసాహారం తినడం ద్వారా రక్తహీనత సమస్యను దూరం చేసుకోవచ్చు.
Also Read: