క్యాన్సర్‌కు సమయపాలన, పోషకాలు లేని ఆహార అలవాట్లు, జీవనశైలి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి.. సరైన సమయంలో..
ప్రస్తుత కాలంలో అనేక మంది క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. 2020లో ఒక కోటి మందికి పైగా ప్రజలు క్యాన్సర్‌తోనే మరణించారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ సమస్యతోనే చనిపోతున్నారు. నిజానికి మానవులను పట్టిపీడిస్తున్న ప్రాణాంతక ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ కూడా ఒకటి. ఇక ఈ క్యాన్సర్ బారిన పడినవారిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. అయితే క్యాన్సర్‌కు సమయపాలన, పోషకాలు లేని ఆహార అలవాట్లు, జీవనశైలి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి.. సరైన సమయంలో చికిత్స చేయించుకుంటే ఈ వ్యాధి ముప్పు నుంచి బయటపడవచ్చని వారు సూచిస్తున్నారు. క్యాన్సర్‌లో అనేక రకాలు ఉన్నాయి. అందులో గొంతు క్యాన్సర్ కూడా ఒకటి. ఇంకా ఇది కూడా చాలా ప్రమాదకరమైనది.
ఎంతో మంది దీని బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సిగరెట్, ఆల్కహాల్, పొగాకు, గుట్కా మొదలైనవి గొంతు క్యాన్సర్‌కు ప్రధానంగా కారణం. గొంతు క్యాన్సర్ సంకేతాలను సకాలంలో గుర్తించినట్లయితే.. ఈ ప్రాణాంతక వ్యాధిని నివారించవచ్చు. చెవిలో నొప్పి, మెడలో వాపు, మింగడంలో ఇబ్బంది, గొంతు క్యాన్సర్ వంటి కొన్ని సంకేతాల ఆధారంగా ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించవచ్చు. ఎవరిలోనైనా ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అప్రమత్తమై.. వైద్యుడిని సంప్రదించినట్లయితే.. గొంతు క్యాన్సర్‌కు సులభంగా చికిత్స చేయవచ్చు.