ఈ ఒక్క ప్యాక్ తో ఎంత నల్లటి మెడ అయినా మెరవడం ఖాయం!!

|

Aug 07, 2023 | 7:32 PM

ఎప్పుడూ ఏదొక పనిమీద లేదా.. రోజూ బయటకు వెళ్లేవారికి ముఖం, మెడ, చేతులు నలుపెక్కడం సర్వ సాధారణం. కాలుష్యం, దుమ్ము కారణంగా మృతకణాలు పేరుకుపోయి చర్మం నల్లబారుతుంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే లావుగా ఉన్నవారికి కూడా మెడ నల్లగా.. అంద విహీనంగా కనిపిస్తుంటుంది. అలాంటి వారికి ఈ చిట్కా ఒక ఔషధంలా పనిచేస్తుంది. నల్లని మెడతో బయటకు..

ఈ ఒక్క ప్యాక్ తో ఎంత నల్లటి మెడ అయినా మెరవడం ఖాయం!!
Beauty Tips
Follow us on

ఎప్పుడూ ఏదొక పనిమీద లేదా.. రోజూ బయటకు వెళ్లేవారికి ముఖం, మెడ, చేతులు నలుపెక్కడం సర్వ సాధారణం. కాలుష్యం, దుమ్ము కారణంగా మృతకణాలు పేరుకుపోయి చర్మం నల్లబారుతుంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే లావుగా ఉన్నవారికి కూడా మెడ నల్లగా.. అంద విహీనంగా కనిపిస్తుంటుంది. అలాంటి వారికి ఈ చిట్కా ఒక ఔషధంలా పనిచేస్తుంది. నల్లని మెడతో బయటకు వెళ్లడానికి ఇక సంకోచించనక్కర్లేదు.

ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలంటే:

బియ్యం పిండి, శనగపిండి, పెరుగు, పసుపు, బంగాళదుంప జ్యూస్

ఇవి కూడా చదవండి

-ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బియ్యంపిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, పెరుగు, చిటికెడు పసుపు, 1 టీస్పూన్ బంగాళాదుంప తీసుకోవాలి. శనగపిండి బదులుగా గోధుమపిండిని కూడా తీసుకోవచ్చు.

-వీటన్నింటినీ ఉండలు లేకుండా మెత్తటి పేస్ట్ లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడ ముందు, వెనుక భాగాల్లో బ్రష్ లేదా చేతితో అప్లై చేసుకోవాలి.

-పావుగంట లేదా 20 నిమిషాల తర్వాత మెడకు రాసిన ప్యాక్ ఆరిపోయాక.. చేతిని నీటిలో తడిపి మెడపై మర్దన చేస్తూ.. చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

-ఇలా వారానికి 2-3 సార్లు నెక్ ప్యాక్ వేసుకుంటే.. మెడపై పేరుకున్న నలుపు క్రమంగా తగ్గి.. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. నల్లని మెడ ఉందన్న బెడద ఉండదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి