Shocking Truth: క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌ ను అడ్డుకునే సప్లిమెంట్స్.. ఇవి తీసుకునే ముందు ఆలోచించాల్సిందే..!

ప్రస్తుత రోజుల్లో మార్కెట్‌ లో క్యాన్సర్ నుంచి రక్షణ అని చెప్పే బోలెడన్ని సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి. కానీ ఇవి సరిగ్గా తీసుకోకపోతే మన ఆరోగ్యానికి డేంజర్ కావచ్చు. ఆరోగ్యం పాడు అవ్వడమే కాదు.. కొన్నిసార్లు ఇవే క్యాన్సర్‌ కి కారణం కూడా కావచ్చు. ముఖ్యంగా బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఇ, సెలీనియం, ఫోలేట్ లాంటి పోషకాలను టాబ్లెట్స్ రూపంలో ఎక్కువగా తీసుకుంటే.. బాడీపై నెగిటివ్ ఎఫెక్ట్స్ పడతాయని రీసెర్చెస్ చెబుతున్నాయి.

Shocking Truth: క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌ ను అడ్డుకునే సప్లిమెంట్స్.. ఇవి తీసుకునే ముందు ఆలోచించాల్సిందే..!
Avoid These Supplements

Updated on: Jul 16, 2025 | 8:17 PM

సప్లిమెంట్స్‌పై ఎక్కువగా డిపెండ్ అవ్వడం అస్సలు మంచిది కాదు. పోషకాలను ఆహారం ద్వారా తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్. కొన్ని సప్లిమెంట్స్ కీమోథెరపీ, రేడియేషన్ లాంటి ట్రీట్‌ మెంట్స్‌పై కూడా ఎఫెక్ట్ చూపొచ్చు. అందుకే డాక్టర్ సలహా లేకుండా ఏ సప్లిమెంట్ కూడా తీసుకోకూడదు. ఏ సప్లిమెంట్స్ తీసుకుంటే ఎలా ఆరోగ్యానికి ఎఫెక్ట్ పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బీటా కెరోటిన్

బీటా కెరోటిన్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. ముఖ్యంగా స్మోకింగ్ చేసేవాళ్ళలో లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని పరిశోధనలు తేల్చాయి. కొందరిలో ఇది గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌ కి కూడా దారితీస్తుందని చెప్పారు. అంతేకాదు విటమిన్ ఇ లాంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ట్రీట్‌మెంట్ రిజల్ట్స్‌పై ప్రభావం చూపుతాయి. కానీ ఇదే బీటా కెరోటిన్ పండ్లు, కూరగాయల రూపంలో తీసుకుంటే మాత్రం హెల్త్‌ కి మంచిది.

విటమిన్ సి

విటమిన్ సి బాడీకి చాలా అవసరం. కానీ ఎక్కువ మోతాదులో టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే కీమోథెరపీ ట్రీట్‌మెంట్‌ ని ఇది అడ్డుకోవచ్చు. కాబట్టి విటమిన్ సి ని డైరెక్ట్‌గా ఆరెంజ్, ఉసిరికాయ లాంటి ఫుడ్ ఐటమ్స్ నుంచి పొందడం బెస్ట్.

విటమిన్ ఇ

విటమిన్ ఇ ఎక్కువగా తీసుకునే పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 17 శాతం పెరిగినట్లు క్లినికల్ స్టడీస్ క్లియర్‌ గా చెప్పాయి. దీన్ని సప్లిమెంట్స్ రూపంలో కాకుండా.. శనగలు, నువ్వులు లాంటి సహజ వనరుల ద్వారా పొందడం ఉత్తమం.

సెలీనియం

సెలీనియం ఒక ఇంపార్టెంట్ మినరల్. కానీ బాడీలో అవసరానికి మించి తీసుకుంటే.. ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఇది సరిపడా ఉందో లేదో బ్లడ్ టెస్ట్‌ల ద్వారా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాలి.

ఫోలిక్ యాసిడ్

ఫోలేట్ బాడీకి చాలా అవసరం. కానీ అధిక స్థాయిలో ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల.. ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ 24 శాతం పెరిగే ఛాన్స్ ఉందని పరిశోధనలు వార్నింగ్ ఇస్తున్నాయి. దీన్ని కూడా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి.

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సప్లిమెంట్స్‌ ని నమ్మకూడదు. బదులుగా మంచి ఆహారపు అలవాట్లు, ఫిజికల్ యాక్టివిటీ, సరిపడా నిద్ర, స్ట్రెస్ తగ్గించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, గింజలు, ధాన్యాలు లాంటి నాచురల్ ఫుడ్స్‌ లో దొరికే పోషకాలు బాడీకి తగిన మోతాదులో అందుతాయి. అలాగే రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాక.. ఒకవేళ అవసరమనిపిస్తే డాక్టర్ సలహా తీసుకున్నాకే టాబ్లెట్స్ వాడాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)