కొంచెం తింటే ఏం కాదులే అనుకుంటున్నారా.. అదే డేంజర్
చాలామంది ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకుంటుంటారు. ఇటీవల ఈ ఆహారం ఆరోగ్యానికి మంచిదికాదని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోయిన వారు కొంచెం తింటే ఏం కాదులే అనుకుంటూ తింటుంటారు. అది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు పరిశోధకులు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలను మితంగా తీసుకున్నా మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర కలిపిన శీతల పానీయాలు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహార పదార్థాలు అత్యంత హానికరమని స్పష్టం చేశారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్’ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. వారి నివేదిక ప్రతిష్ఠాత్మక ‘నేచర్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం ప్రకారం, రోజుకు కేవలం 0.6 నుంచి 57 గ్రాముల మధ్య ప్రాసెస్ చేసిన మాంసం తినేవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 11 శాతం అధికంగా ఉన్నట్టు కనుగొన్నారు. అలాగే, 0.78 నుంచి 55 గ్రాముల మధ్య తీసుకునే వారిలో పెద్దప్రేగు క్యాన్సర్ ముప్పు 7 శాతం పెరుగుతుందని తేలింది. ఇక చక్కెర కలిపిన పానీయాల విషయానికొస్తే, రోజుకు 1.5 నుంచి 390 ml వరకు తాగేవారిలో టైప్ 2 డయాబెటిస్ రిస్క్ 8 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. రోజుకు ఒక సర్వింగ్ లేదా అంతకంటే తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ, వ్యాధుల ముప్పు గణనీయంగా పెరుగుతోందని పరిశోధకులు తెలిపారు. ప్రాసెస్ చేసిన మాంసాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాల వల్ల శరీరంలో కణితులు ఏర్పడే ప్రమాదం ఉందని, చక్కెర పానీయాలు జీవక్రియ సమస్యలకు దారితీస్తాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర పానీయాలు, ట్రాన్స్ ఫ్యాట్స్ వాడకాన్ని తగ్గించాలని సూచించే ఆహార మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పరిశోధకులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదేమన్నా బొమ్మ అనుకుంటివా.. ప్రాణాలు తీసే కింగ్ కోబ్రా.. అలా ఎలా నిలబెట్టావ్ అన్న
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
