బిచ్చగాళ్లకు ఒత్తైన జట్టు.. మనకేమో బట్టతలలా? దాని వెనకున్న ఈ 5 రహస్యాలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

బిచ్చగాళ్లు పరిశుభ్రత పాటించకపోయినా, ఎలాంటి ఉత్పత్తులు వాడకపోయినా ఒత్తైన జుట్టుతో ఉంటారు. కానీ మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా, ఖరీదైన షాంపూలు, కండిషనర్లు, నూనెలు వాడినా జుట్టు ఊడిపోతుంది, బట్టతల సమస్య వస్తుంది. ఈ వింతకు గల ఐదు ఆశ్చర్యకరమైన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బిచ్చగాళ్లకు ఒత్తైన జట్టు.. మనకేమో బట్టతలలా? దాని వెనకున్న ఈ 5 రహస్యాలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!
Beggars Hair And Ours

Updated on: Dec 31, 2025 | 8:19 AM

మీరెప్పుడైనా గమనించారు రోడ్డు పక్కన బిచ్చగాళ్లు ఎలా ఉంటారో. సాధారణంగా అయితే చిరిగి, మాసిపోయిన బట్టలతో, చింపిరి జుట్టు, గడ్డంతో ఉంటారు. ఇంకాస్త జాగ్రత్తగా గమనిస్తే 100లో 90 మందికి ఒత్తైన జట్టు ఉంటుంది. భారీగా పెరిగిపోయి, చింపిరి చింపిరిగా ఉన్నా.. బట్టతల అయితే ఉండదు. కానీ, రకారకాల షాంపులు, కండీషనర్లు, హెయిర్‌ ఆయిల్స్‌ వాడుతున్నా హెయిర్‌ స్పాలు చేయిస్తున్నా.. మనలో చాలా మందికి యంగ్‌ ఏజ్‌లోనే జట్టు ఊడిపోతుంది. డాక్టర్లు వద్దకెళ్లి ట్రీట్మెంట్‌లు తీసుకున్నా కూడా ఫలితం ఉండటం లేదు. వనమూలికలతో చేసిన ఆయిల్స్‌ అంటూ సోషల్‌ మీడియాలో చూసి వేలకు వేలు తగలేసి వాటిని తెప్పించి వాడినా కూడా బట్టతల రాకుండా ఆపలేకపోతున్నాయి. మరి మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా? మన జట్టు ఊడిపోతుంది, అస్సలు జట్టు ఉందనే విషయం కూడా పట్టించుకోని బిచ్చగాళ్లకు మాత్రం ఒత్తుగా జట్టు పెరుగుతుంది. వింటుంటే అవును కదా భలే విచిత్రంగా ఉందని అనిపించినా.. దాని వెనుక ఓ ఐదు కారణాలు కూడా నిజమే కదా అని అనిపించేలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

షాంపులు, కెమికల్‌ సిరమ్‌ల వాడకం

సాధారణంగా బిచ్చగాళ్లు స్నానం చేయకుండా ఎక్కువ రోజులు ఉంటారు. అలాంటిది వాళ్లు తలకు షాంపులు, కెమికల్‌ సిరమ్‌లు వాడలేరు కదా, మనం మాత్రం విచ్చల విడిగా రకరకాల షాంపులు, కెమికల్‌ సిరమ్‌లు, కండీషనర్లు వాడుతుంటాం. ఇవి అతిగా వాడటం వల్ల జట్టు రూట్స్‌ బలహీనపడి ఊడటం స్టార్ట్‌ అవుతుంది.

ఎక్కువ సేపు ఎండలో ఉండటం

బిచ్చగాళ్లు రోడ్ల వెంట తిరుగుతూ ఉంటారు. వారికంటూ పర్మినెంట్‌ షెల్టర్‌ ఉండదు. రోజులో ఎక్కువ సేపు ఎండలో ఉంటారు. దీంతో వారికి విటమిన్‌ డీ కావాల్సింనంత లభిస్తుంది. అది జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇక మన విషయానికి వస్తే కాస్త ఎండ తగిలితే చాలు కందిపోయేంత ఎండకు దూరం అయిపోయాం. ఇంట్లో ఏసీ, ఆఫీస్‌లో ఏసీ, కార్‌లో ఏసీ.. అసలు బాడీకి ఎండ తగలనివ్వడం లేదు. దీంతో విటమిన్‌ డీ లోపంతో జుట్టు ఊడుతుంది.

ఎక్కవగా తలస్నానం

బిచ్చగాళ్లు ఎక్కువగా తలస్నానం చేయరు. ఏడాదికి ఒకసారి చేసినా చేసినట్టే. కానీ, మనం శుభ్రంగా ఉండేందుకు వారంలో నాలుగైదు సార్లు తలస్నానం చేస్తాం. కొంతమంది రోజు తలస్నానం చేసేవాళ్లు ఉన్నారు. అలాగే హెయిర్‌ డ్రయర్‌ను ఎక్కువగా వాడటం కూడా జట్టు ఊడేందుకు ఒక కారణం అవుతుంది.

నో స్ట్రెస్‌, మంచి నిద్ర

బిచ్చగాళ్లు పెద్దగా టెన్షన్లు ఉండవు. ఈ జాబ్‌ స్ట్రెస్‌, డబ్బులు బాగా సంపాదించాలనే మెకానికల్‌ లైఫ్‌ వాళ్లది కాదు. ఆకలేస్తే అడుక్కుంటారు, ఏదైనా దొరికితే తినేసి పడుకుంటారు. దాంతో వారి లైఫ్‌లో స్ట్రెస్‌ ఉండదు, అలాగే బాగా నిద్రపోతారు. సాధారణంగా మన జీవితాల్లో కావాల్సినంత స్ట్రెస్‌ ఉంటుంది. చాలా మంది లేట్‌ నైట్‌ నిద్రపోవడం, తక్కువ నిద్రపోవడం కూడా జుట్టు ఉడేందుకు కారణం అవుతుంది.

జుట్టు మీద అతి శ్రద్ధ

మనలో చాలా మంది జట్టుపై అతి శ్రద్ధ చూపిస్తారు. అందంగా కనిపించాలనే ఉద్దేశంతో వివిధ రకాల హెయిర్‌ ఆయిల్స్‌ వాడటం, గంటకోసారి దువ్వడం, జట్టు ఒకే షేప్‌లో ఉండేందుకు వ్యాక్స్‌ లాంటివి వాడటం చేస్తుంటారు. కానీ, బిచ్చగాళ్లు అసలు జుట్టును పట్టించుకోరు. అతి శ్రద్ధ కూడా జట్టు ఊడేందుకు కారణం అవుతుంది.

మరిన్ని హెల్త్‌ ఆర్టికల్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి