భోజనం చేశాక ఈ పనులు చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయట.. అధ్యయనాల్లో తేలిన షాకింగ్ విషయాలు..

|

May 07, 2021 | 6:41 PM

ప్రస్తుత డిజిటల్ కాలంలో మన ఆరోగ్య జీవన విధానంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సమయానికి తగిన ఆహారం తీసుకోకపోవడం చేస్తుంటాం.

భోజనం చేశాక ఈ పనులు చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయట.. అధ్యయనాల్లో తేలిన షాకింగ్ విషయాలు..
Eating Time
Follow us on

ప్రస్తుత డిజిటల్ కాలంలో మన ఆరోగ్య జీవన విధానంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సమయానికి తగిన ఆహారం తీసుకోకపోవడం చేస్తుంటాం. అంతేకాదు… భోజనం చేశాక చాలా మందికి బద్దకంగా ఉంటుంది. అలాగే మరికొందరు తిన్న తర్వాతే ఏ పనైనా చేస్తాం అనుకుంటుంటారు. ఇక అలాగే భోజనం చేశాక రకారకాల పనులు చేసి.. అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే అవి కేవలం సరైయైన ఆహారం తీసుకోకపోవడం వల్లే ఈ సమస్యలు వచ్చాయి అనుకుంటారు. కానీ అసలు కారణం అది కాదు. భోజనం చేసిన తర్వాత కొన్ని పనలుు చేయడం వలన కూడా అనారోగ్య సమస్యలు వస్తుంటాయట. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మరీ అవెంటో తెలుసుకుందామా.

భోజనం చేశాక చేయకూడని పనులు..

1. చాలా మందికి అన్నం తిన్న వెంటనే ఏవైనా పండ్లు తినే అలవాటు ఉంటుంది. కానీ అలా తినడం అసలు మంచిది కాదు. ఎందుకంటే తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోపు పండ్లను తినడం వలన ఆ పోషకాలన్ని కోల్పోతాం. అందుకే భోజనం తర్వాత గంట వరకు అసలు ఎలాంటి పండ్లను తినకూడదు.

2. కొందరికి భోజనం చేయగానే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అలాగే నిద్రపోతుంటారు. కానీ అలా చేయకూడదు. భోజనం చేయగానే నిద్రపోతే బరువు పెరుగుతారు. తిన్న వెంటనే వ్యాయామం కూడా చేయకూడదు. అలేగా టీ, కాఫీలు తాగకూడదు. అలా అని తిన్న వెంటనే కూర్చోకూడదు. మెల్లిగా కాసేపు అటూ ఇటూ నడవండి చాలు.

3. ఇక మరికొందరికి భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తుంటారు. ఇలా చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాదు. దీంతో పాటు గ్యాస్, కడుపులో మంట వంటివి వస్తాయి. అంతగా స్నానం చేయాలనుకుంటే భోజనమయ్యాక ఓ గంట ఆగి చేయండి.

Also Read: Adipurush: మకాం మార్చిన ఆదిపురుష్ టీం.. ఇక పై షూటింగ్ అంతా అక్కడే.. అసలు కారణం అదే..

బాలకృష్ణకు జోడీగా పవన్ హీరోయిన్.. మరోసారి లక్కీ హీరోయిన్‏కే ఛాన్స్ ఇవ్వనున్న డైరెక్టర్..