Heart Attack Symptoms: గుండెపోటుకు ముందుగా కనిపించే లక్షణాలివే.. వెంటనే అలెర్ట్ అవ్వండి!

|

Oct 20, 2022 | 2:06 PM

చాలా సందర్భాల్లో సడన్ హార్ట్ స్ట్రోక్స్ వల్ల మృత్యువాత పడుతున్నారు. అయితే గుండెపోటు రావడానికి ముందు కొన్ని లక్షణాలను మనం గుర్తించినట్లయితే..

Heart Attack Symptoms: గుండెపోటుకు ముందుగా కనిపించే లక్షణాలివే.. వెంటనే అలెర్ట్ అవ్వండి!
Heart Attack Symptoms
Follow us on

గత కొన్ని నెలలుగా దేశంలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. పెద్దా, చిన్నా అనే తేడా లేదు.. యుక్తవయస్సులోనే చాలామందికి గుండెపోటు వస్తోంది. అలాగే చాలా సందర్భాల్లో సడన్ హార్ట్ స్ట్రోక్స్ వల్ల మృత్యువాత పడుతున్నారు. అయితే గుండెపోటు రావడానికి ముందు కొన్ని లక్షణాలను మనం గుర్తించినట్లయితే.. రోగి ప్రాణాలను కాపాడవచ్చు. ఆ లక్షణాలు ఏంటో, గుండె జబ్బులను ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, పోస్ట్ కోవిడ్ కారణంగా గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని డాక్టర్ చిన్మయ్ గుప్తా తెలిపారు. జంక్ ఫుడ్, మద్యం సేవించడం, ధూమపానం లాంటి అలవాట్లు గుండె జబ్బులకు దారి తీస్తాయి. దీనితో పాటు, కరోనా కారణంగా గుండె ధమనులలో రక్తం గడ్డకట్టడం వల్ల, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలపై శ్రద్ధ వహించకపోవడమే.. హార్ట్ స్ట్రోక్ కేసులు పెరగడానికి ప్రధాన కారణం. చాలా సందర్భాలలో, ఛాతీ నొప్పి లేదా గ్యాస్ నొప్పి వచ్చినప్పుడు.. కొందరు పెద్దగా దాని గురించి పట్టించుకోరు. అయితే ఆ సమస్య కాస్తా గుండెపోటుకు దారి తీసే అవకాశం ఉంది. జన్యుపరమైన కారణాలు, అధిక మానసిక ఒత్తిడి కారణంగా కూడా గుండెపోటు రావచ్చు. కాబట్టి మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి.

గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు:

  • ఆకస్మిక అధిక చెమట
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • ఛాతీ నొప్పి, బిగుతుగా అనిపించడం
  • వికారం, ఎడమ చేయి, భుజం నొప్పి
  • మెడ, దవడ లేదా వెనుక భాగంలో నొప్పి ప్రసరిస్తుంది

గుండె జబ్బులను ఎలా నివారించాలి..

  • విటమిన్లు, ప్రోటీన్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
  • రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి
  • ధూమపానం, మద్యపానాన్ని నిషేదించాలి
  • ప్రతి మూడు నెలలకోసారి గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి.
  • కనీసం ఏడు గంటలు నిద్రపోవాలి