Health Tips: మీ గోళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే..

|

Nov 20, 2022 | 11:08 AM

ఈ రోజుల్లో ప్రజల జీవనశైలి చాలా మార్పుచెందింది. దీనికి తోడు అనారోగ్యకరమైన ఆహారం ప్రజలను అనేక వ్యాధుల బారిన పడేలా చేస్తోంది. అదే సమయంలో పేలవమైన జీవనశైలి కారణంగా కొలెస్ట్రాల్‌తో సహా గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతోంది.

Health Tips: మీ గోళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే..
గోళ్లను తేమగా ఉంచడం వల్ల అవి అందంగా, మృదువుగా కనిపిస్తాయి. ఇందుకోసం గోళ్లపై మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవచ్చు.
Follow us on

Cholesterol symptoms : ఈ రోజుల్లో ప్రజల జీవనశైలి చాలా మార్పుచెందింది. దీనికి తోడు అనారోగ్యకరమైన ఆహారం ప్రజలను అనేక వ్యాధుల బారిన పడేలా చేస్తోంది. అదే సమయంలో పేలవమైన జీవనశైలి కారణంగా కొలెస్ట్రాల్‌తో సహా గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతోంది. కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుదల కారణంగా ఊబకాయం, అధిక రక్తపోటు ప్రమాదం కూడా ప్రజలలో పెరుగుతుంది. సాధారణంగా కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మీ గోళ్ళలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు పొరపాటున కూడా విస్మరించకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు మీ గోళ్ళలో, చేతుల్లో కనిపించే లక్షణాలు ఏమిటి..? అలాంటి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గోర్లు – చేతుల్లో కనిపించే లక్షణాలు

  1. గోర్లు పసుపు రంగులో కనిపించడం: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు మీ గోళ్ల రంగు పసుపు రంగులోకి మారుతుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేదని సూచిస్తుంది. దీనివల్ల గోళ్ల రంగు పసుపు రంగులోకి మారడం లేదా గోళ్లలో పగుళ్లు ఏర్పడడం ప్రారంభమవుతుంది. అంతే కాదు మీ గోళ్ల పెరుగుదల కూడా ఆగిపోతుంది.
  2. చేతుల్లో నొప్పి: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిన వెంటనే.. ఇది చేతుల రక్తనాళాలను మూసివేయగలదు. దీనివల్ల చేతుల్లో నొప్పి మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో మీకు కూడా చేతుల్లో నొప్పి సమస్య ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
  3. చేతుల్లో జలదరింపు: శరీరంలోని కొన్ని భాగాలలో రక్త ప్రసరణను అడ్డుకోవడం వల్ల చేతుల్లో జలదరింపు కనిపిస్తుంది. అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం కారణంగా రక్త ప్రసరణ సక్రమంగా జరగదు. దీంతో చేతుల్లో జలదరింపు వస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి