ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్టే.. ఇంకా, షుగర్ కూడా వస్తుందట..

|

Sep 18, 2024 | 9:28 AM

కాలేయం మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం.. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలోని విషపూరితమైన పదార్థాలను తొలగించడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలోని పలు అవయవాలు, వాటి విధులు సజావుగా నడపడానికి సహాయపడుతుంది. కానీ, మనం మన దినచర్యలో చేసే కొన్ని పొరపాట్లు..

ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్టే.. ఇంకా, షుగర్ కూడా వస్తుందట..
Liver Health
Image Credit source: Getty Images
Follow us on

కాలేయం మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం.. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలోని విషపూరితమైన పదార్థాలను తొలగించడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలోని పలు అవయవాలు, వాటి విధులు సజావుగా నడపడానికి సహాయపడుతుంది. కానీ, మనం మన దినచర్యలో చేసే కొన్ని పొరపాట్లు అది కాలేయానికి ప్రమాదకరంగా మారుతాయి. ముఖ్యంగా, ఉదయాన్నే చేసే చెడు అలవాట్లు కాలేయానికి హాని కలిగిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయం పాడైతే, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. అలాంటి కొన్ని తప్పుల గురించి తెలుసుకుందాం.. వాటిని సరిదిద్దుకోకపోతే, కాలేయంపై భారీ ప్రభావం చూపుతుంది. ఇది భవిష్యత్తులో ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉదయాన్నే ఇలా చేయకండి..

  1. నీరు త్రాగకుండా రోజును ప్రారంభించడం: ఉదయాన్నే మొదట నీరు త్రాగడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది ఈ అలవాటును విస్మరిస్తారు.. ఇది కాలేయానికి ప్రమాదకరం. రాత్రి నిద్రపోతున్నప్పుడు శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.. ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు త్రాగడం వల్ల శరీరంలో నీటి కొరతను భర్తీ చేస్తుంది. నీరు తాగడం వల్ల కాలేయంలోని విషపూరిత మూలకాలు తొలగిపోయి శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. మీరు నీరు త్రాగకుండా రోజుని ప్రారంభిస్తే, అది కాలేయ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.
  2. ఉదయాన్నే నూనె – కొవ్వు పదార్థాలు తినడం: చాలా మంది ఉదయాన్నే అల్పాహారంగా వేయించిన లేదా కొవ్వు పదార్ధాలను తినడానికి ఇష్టపడతారు. ఆయిల్, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినడమే కాకుండా కాలేయంపై కూడా ప్రభావం చూపుతుంది. కొవ్వు పదార్ధాలు కాలేయంలో కొవ్వు పేరుకునేలా చేస్తాయి. ఇది కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది కాలేయం సాధారణ పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. చాలా కాలం పాటు నిర్లక్ష్యం చేస్తే, మధుమేహం వంటి వ్యాధులకు దారితీస్తుంది.
  3. వ్యాయామం చేయకపోవడం: ఉదయాన్నే కొంత వ్యాయామం చేయడం వల్ల శరీరానికే కాకుండా కాలేయానికి కూడా మేలు జరుగుతుంది. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. జీవనశైలి చాలా నిశ్చలంగా ఉండే వ్యక్తులు, అంటే రోజంతా కూర్చుని ఉదయం వ్యాయామం చేయని వారు వారి కాలేయంపై ప్రతికూల ప్రభావాన్ని అనుభవిస్తారు. దీని కారణంగా, కాలేయం క్రమంగా బలహీనంగా మారుతుంది. భవిష్యత్తులో తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది.
  4. ఉదయం మిగిలిపోయిన ఆహారం: చాలా మంది రాత్రి నుండి మిగిలిపోయిన ఆహారాన్ని ఉదయం తింటారు. అయితే ఈ అలవాటు కాలేయానికి హాని చేస్తుందని మీకు తెలుసా?.. మిగిలిపోయిన లేదా చద్ది ఆహారం కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఎందుకంటే కాలేయం శరీరంలోని బ్యాక్టీరియా, టాక్సిన్స్‌ను తొలగించడానికి చాలా కష్టపడాలి. ఇది కాలేయ పనితీరును బలహీనపరుస్తుంది.
  5. సిగరెట్ – మద్యం తాగడం: ఉదయం నిద్రలేచిన తర్వాత సిగరెట్ తాగడం లేదా మద్యం సేవించడం కాలేయానికి అత్యంత హానికరం. ధూమపానం, ఆల్కహాల్ కాలేయ కణాలను దెబ్బతీస్తాయి. ఇది కాలేయ పనితీరును దెబ్బతీస్తుంది. సకాలంలో ఆపకపోతే లివర్ సిర్రోసిస్ లేదా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

(ఈ సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. ఫాలో అయ్యేముందు డాక్టర్లను సంప్రదించండి)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..