Health Tips: ఈ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు టమోటా తినడం చాలా ప్రమాదకరం..!

|

Apr 10, 2022 | 10:08 PM

Health Tips: ఆహార రుచిని పెంచే టొమాటో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని చాలా రకాలుగా వినియోగిస్తారు. ప్రధానంగా కూరగాయలు, సలాడ్లు, చట్నీలలో ఎక్కువగా తింటారు.

Health Tips: ఈ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు టమోటా తినడం చాలా ప్రమాదకరం..!
Tomato
Follow us on

Health Tips: ఆహార రుచిని పెంచే టొమాటో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని చాలా రకాలుగా వినియోగిస్తారు. ప్రధానంగా కూరగాయలు, సలాడ్లు, చట్నీలలో ఎక్కువగా తింటారు. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ సి కూడా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఈ కారణంగా ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాదు లైకోపీన్, పొటాషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. శరీరానికి ప్రయోజనకరంగా ఉండటం వల్ల నిపుణులు దీనిని సలాడ్ రూపంలో రోజుకు ఒకసారైనా తినాలని సూచిస్తారు. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంతమంది టమోటా తినకూడదు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు టమోటాలు తీసుకుంటే వ్యాధి తీవ్రత ఇంకా పెరుగుతుంది.

కిడ్నీ, పిత్తాశయంలో రాళ్లు

కిడ్నీ, పిత్తాశయంలో రాళ్ల సమస్య ఉన్నవారు టొమాటోలను తక్కువ మోతాదులో తీసుకోవాలి. టమోటా గింజలు రాళ్ల సమస్యను మరింత పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు టొమాటో తినాలంటే విత్తనాలను వేరు చేసిన తర్వాత తినాలి.

కీళ్ళ నొప్పులు

కీళ్లనొప్పులు వంటి తీవ్రమైన సమస్యలు ఉన్నవారు టమోటాలు తినకుండా ఉండాలి. ఇందులో ఉండే పులుపు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని మరింత పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం అలాంటి వ్యక్తులు టమోటాలను తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ వారు తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకే టమోటాలు తినాలి.

అతిసారం

టొమాటోను హైడ్రేటింగ్ వెజిటేబుల్ అని పిలిచినప్పటికీ విరేచనాల సమయంలో దీనికి దూరంగా ఉండటం మంచిది. టమోటాల్లో ఉండే సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా డయేరియా సమస్యను మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. మీరు డయేరియా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే టమోటాకి దూరంగా ఉండటం మంచిది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Washing Machine: వాషింగ్‌ మిషన్ ఎక్కువ కాలం ఉపయోగించాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Knowledge: ప్రపంచంలో అత్యంత బరువైన చిలుక గురించి మీకు తెలుసా..!

Health Tips: ధృడమైన ఎముకల కోసం పాలు మాత్రమే సరిపోవు.. ఈ ఆహారాలు కూడా ముఖ్యమే..!