Health Tips: పురుషులకే ఇవే బ్రహ్మాస్త్రాలు.. వీటిని తిన్నారంటే ఆ సమస్యలన్నింటికి ఫుల్‌స్టాప్.!

|

Jul 01, 2024 | 9:12 PM

సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో పోషకాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పునరుత్పత్తి ఆరోగ్యం విషయంలో ఎక్కువగా మహిళల గురించే చర్చిస్తారు కానీ, సంతానోత్పత్తి విషయంలో పురుషుల పాత్ర చాలా కీలకమైనది. అందుకే పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేసి, స్మెర్మ్‌ కౌంట్‌ను..

Health Tips: పురుషులకే ఇవే బ్రహ్మాస్త్రాలు.. వీటిని తిన్నారంటే ఆ సమస్యలన్నింటికి ఫుల్‌స్టాప్.!
Representative Image
Image Credit source: Getty Images
Follow us on

సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో పోషకాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పునరుత్పత్తి ఆరోగ్యం విషయంలో ఎక్కువగా మహిళల గురించే చర్చిస్తారు కానీ, సంతానోత్పత్తి విషయంలో పురుషుల పాత్ర చాలా కీలకమైనది. అందుకే పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేసి, స్మెర్మ్‌ కౌంట్‌ను పెంచే కొన్ని ఆహార పదార్థాలను నిపుణులు సూచిస్తున్నారు.

వాల్ నట్స్‌లో పుష్కలంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫోలేట్ వీర్యకణాల వృద్ధికి తోడ్పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. బాదం పప్పులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు జింక్, సెలీనియం, విటమిన్-ఇ తదితర పోషకాలు ఉంటాయని చెప్పారు. రోజువారీ ఆహారంలో బాదం పప్పులకు చోటిస్తే స్పెర్మ్ కౌంట్ దెబ్బతినకుండా కాపాడతాయని తెలిపారు. బ్రెజిల్ నట్స్ తో వీర్య కణాల వృద్ధితో పాటు ఆరోగ్యం చేకూరుతుందని వివరించారు. ఇందులోని సెలీనియం స్పెర్మ్ నాణ్యతను పెంచుతుందని తెలిపారు.

వంటింట్లో తప్పకుండా కనిపించే టమాటాలతోనూ వీర్య కణాల నాణ్యత పెంచుకోవచ్చని చెప్పారు. వీటిలో లైకోపీన్ ఉంటుందట. రోజూ రెండు, మూడు టేబుల్ స్పూన్ల టమాటా గుజ్జును తీసుకుంటే స్పెర్మ్ నాణ్యత పెరుగుతుందని వివరించారు. మాంసాహారులైతే సీ ఫుడ్స్ తరచుగా తీసుకోవడం ద్వారా వీర్య పుష్టి పెరుగుతుందట. సముద్రపు చేపలు, రొయ్యలు వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు ఇతరత్రా పోషక పదార్థాలు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి.

ఆకు కూరలు, ఆకు పచ్చని కూరగాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ సెల్యూలార్ దెబ్బతినకుండా కాపాడతాయని, వీర్య కణాల కదలికలను చురుగ్గా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుమ్మడి గింజలలో ఉండే ఫైటోస్టెరాల్ కు టెస్టోస్టెరాన్ స్థాయులను పెంచే గుణముందని పేర్కొన్నారు. పురుషులలో ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల స్పెర్మ్ నాణ్యత పెరుగుతుందని తెలిపారు. స్పెర్మ్ కదలికలను మెరుగ్గా ఉంచేందుకు విటమిన్ సి తోడ్పడుతుందని .. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు.