Weight Loss Tips: బరువు తగ్గాలనుకునేవారు.. ఈ ఆహారం తప్పకుండా తీసుకోవాలంట..ఏ మోతాదులో అంటే..

|

Nov 05, 2022 | 9:11 PM

బరువు తగ్గడం కోసం చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రోజుల వ్యవధిలో బరువు తగ్గడం అసాధ్యం. రోజూ వ్యాయమం చేయడం, తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం వంటివి క్రమం తప్పకుండా చేస్తే దీర్థ కాలంలో మంచి ఫలితాలు..

Weight Loss  Tips: బరువు తగ్గాలనుకునేవారు.. ఈ ఆహారం తప్పకుండా తీసుకోవాలంట..ఏ మోతాదులో అంటే..
Weight Loss Tips
Follow us on

బరువు తగ్గడం కోసం చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రోజుల వ్యవధిలో బరువు తగ్గడం అసాధ్యం. రోజూ వ్యాయమం చేయడం, తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం వంటివి క్రమం తప్పకుండా చేస్తే దీర్థ కాలంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది త్వరగా బరువు తగ్గాలనే ఆలోచనలో ప్రణాళిక లేకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. కాని తొందరపడటం వల్ల బరువు తగ్గే అవకాశాలు తక్కువ. కొన్ని ఆహారాలు బరువు తగ్గడానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కారణమవుతాయంటున్నారు నిపుణులు. బరువు అనేది ప్రతి ఒక్కరి సమస్యగా మారుతుంది. కొందరు వారం అంతా డైట్ చేసి.. వారాంతాల్లో ఎక్కువగా తినేస్తారు. లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. దీనివల్ల కూడా బరువు పెరుగుతారు. రోజువారీ ఆహారం మాత్రమే కాకుండా.. వారాంతాల్లో మీరు తీసుకునే ఆహారం కూడా బరువు తగ్గించే ప్రక్రియకు భంగం కలిగిస్తుందంటున్నారు నిపుణులు. కొన్ని రకాల ఆహారాలను కనీసం వారానికి ఒక్కసారి తీసుకున్నా.. అది బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. వాటిని రోజూ కూడా ఆహారంతో కలిపి తీసుకోవచ్చు. బరువు తగ్గడానికి దోహదపడే ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.

గుడ్లు

కోలిన్, విటమిన్ డి వంటి మూలకాలు గుడ్డులోని పచ్చసొనలో, 4 నుంచి 6 గ్రాముల ప్రోటీన్ గుడ్డులోని తెల్లసొనలో ఉంటాయి. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటానికి వారానికి కనీసం రెండు గుడ్లు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవి వ్యక్తుల బరువు తగ్గడంలోనూ సహాయపడతాయి. అలాగే గుడ్లు తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పెరుగు

పెరుగులో కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియలో సమస్యలు ఉంటే పెరుగును ఆహారంలో చేర్చుకోవచ్చు. దాని ఆరోగ్యకరమైన, ప్రభావవంతమైన ఫలితాలను పొందాలంటే.. కనీసం వారానికి రెండు మూడు సార్లు పెరుగును ఆహారంతో తీసుకోవాలి. రోజూ తీసుకున్నా పర్వాలేదు. కాని పరిమితికి లోబడి తినాలి.

ఇవి కూడా చదవండి

చేప

చేపల్లో అధిక ప్రొటీన్లు ఉంటాయి. నాన్‌వెజ్‌ ఫుడ్‌ తినాలనుకుంటే.. వారానికి ఒక్కసారైనా చేపలు తింటే మంచిది. ప్రోటీన్‌తో పాటు కంటి చూపు, జుట్టు మొదలైన వాటికి ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా దీనిలో అనేక విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి.

చియా విత్తనాలు

చియా సీడ్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి బరువు తగ్గడానికి అత్యంత ప్రభావవంతమైనవి. వారానికి రెండు టీస్పూన్ల చియా విత్తనాలను ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..