Liver Health: ఈ అలవాట్లు ఉంటే మీ లివర్ షెడ్డుకు వెళ్లినట్టే.. అవేంటో తప్పనిసరిగా తెలుసుకోండి..

మనం మన దైనందిన జీవితంలో మన కడుపు, గుండె, కళ్ళ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. కానీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడం గురించి తరచుగా మరచిపోతుంటాం.. ఇది మన శరీరానికి చాలా ముఖ్యమైన అవయవం. అందువల్ల, ఈ అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, మనం మంచి ఆహారాలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

Liver Health: ఈ అలవాట్లు ఉంటే మీ లివర్ షెడ్డుకు వెళ్లినట్టే.. అవేంటో తప్పనిసరిగా తెలుసుకోండి..
Liver Health

Updated on: Nov 11, 2023 | 12:29 PM

మనం మన దైనందిన జీవితంలో మన కడుపు, గుండె, కళ్ళ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. కానీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడం గురించి తరచుగా మరచిపోతుంటాం.. ఇది మన శరీరానికి చాలా ముఖ్యమైన అవయవం. అందువల్ల, ఈ అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, మనం మంచి ఆహారాలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, కొన్నింటికి దూరంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇదిలాఉంటే.. కాలేయం ఆరోగ్యం విషయంలో కొన్ని రోజువారి అలావాట్లకు తప్పనిసరిగా దూరంగా ఉండాలి.. కొన్ని రోజువారీ అలవాట్లు కాలేయానికి హాని కలిగిస్తాయి. కాలేయం సక్రమంగా పనిచేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరోగ్యకరమైన కాలేయంతో – ఆరోగ్యకరమైన శరీరం..

చాలా మంది ఆరోగ్య నిపుణులు మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే, మీ కాలేయ ఆరోగ్యాన్ని పూర్తిగా జాగ్రత్తగా చూసుకోండి. ఇలా చేయని వారి శరీరం క్రమంగా బలహీనపడుతుంది. అంతేకాకుండా పలు సమస్యల బాధ కూడా పెరుగుతుంది.

ఈ ఆహారాలు తినడం వల్ల కాలేయం ఆరోగ్యం పాడవుతుంది.

రుచి తగినట్లు.. మనస్సును సంతృప్తి పరచడం కోసం మనం తరచుగా కొన్ని ఆహారాలను తినడం ప్రారంభిస్తాము.. వాటిల్లో స్వీట్స్, ఫ్రై పదార్థాలు, మద్యం.. మాంసాహారం.. ఇలా ఎన్నో ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి. హెల్తీ లివర్ కావాలంటే రెడ్ మీట్, సోడా, శీతల పానీయాలు, ఆల్కహాల్, ఆయిల్ ఫుడ్స్‌కు వీలైనంత దూరంగా ఉండండి.

ఈ 3 చెడు అలవాట్లను వదిలేయండి..

అనారోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తినడం వల్ల కాలేయం దెబ్బతింటుందని మీరు అనుకుంటే, ఇది నిజం కాదు. మనం నిత్య జీవితంలో చేసే కొన్ని పొరపాట్లు కాలేయానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. మీరు ఏ విషయాలను నివారించాలో ఇప్పుడు తెలుసుకోండి..

పగటిపూట నిద్రపోయే అలవాటు: కొంతమందికి పగటిపూట నిద్రపోయే చెడు అలవాటు ఉంటుంది. 10 నుంచి 20 నిమిషాల పాటు కునుకు తీయడం వల్ల ఎటువంటి హాని ఉండదు.. కానీ మీరు పగటిపూట అతిగా నిద్రపోతే అది హానికరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కాలేయంపై ప్రభావం పడుతుందట..

రాత్రంతా మేల్కొని ఉండే అలవాటు: కొంతమందికి అర్థరాత్రి వరకు పని చేయడం లేదా లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం అలవాటు ఉంటుంది.. దీని కారణంగా వారు చాలా ఆలస్యంగా నిద్రపోతారు. ఇది కాలేయ ఆరోగ్యానికి మంచిది కాదు.

చాలా కోపంగా ఉండటం: మన కోపాన్ని అదుపులో ఉంచుకోవడం.. మన మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాదు, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా ముఖ్యం. అందువల్ల, మీ కోపాన్ని తగ్గించుకొని.. మానసిక స్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..