Jamun Seeds Health Benefits: ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా నేరెడు పండ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాలానికి అనుగుణంగా లభించే పండ్లలో నేరేడు పండు ఒకటి. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ పండును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనలో చాలా మంది నేరేడు పండు గుజ్జును తినేసి లోపల ఉండే గింజను పడేస్తుంటాం. అయితే వీటి వల్ల కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం మీకు తెలుసా.? నేరేడు గింజలతో కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఇకపై మీరు పొరపాటున కూడా చెత్తలో పాడేయ్యరు. ఇంతకీ నేరేడు గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి.? వాటిని ఎలా తీసుకుంటే మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
* హైబీపీతో బాధపడే వారికి నేరేడు గింజలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. నేరేడు గింజలను పొడిగా చేసి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ బీపీని కంట్రోల్ చేస్తుంది.
* నేరేడు గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియ రేటును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో ఇది బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది.
* అల్సర్, వాపులు వంటి సమస్యతో బాధపడేవారికి నేరేడు గింజల పొడి మంచి ఔషధంలా పని చేస్తాయి. దీంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
* షుగర్ పేషెంట్స్ నేరేడు గింజలతో శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే.. జాంబోలైన్, జంబోసైన్ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి.
* నేరేడు గింజలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి.
* నేరేడు గింజలను పొడిగా చేసి నేరుగా తీసుకోవచ్చు లేదా ఆహారంపై చల్లి తినొచ్చు.
Also Read: 2-DG Drug: అన్ని వేరియంట్లకు 2డీజీ డ్రగ్ రక్షణ కవచమే… తాజా అధ్యయనంలో వెల్లడి
Headphones: మీ పిల్లలు హెడ్‌ఫోన్స్ వాడుతున్నారా? అయితే వెంటనే ఆపేయండి లేదంటే..