Alzheimer’s: అల్జీమర్స్‌తో తస్మాత్ జాగ్రత్త! ఇలా చేస్తే ఇబ్బందులు తప్పుతాయి.. పూర్తి వివరాలు..
అల్జీమర్స్ బాగా ముదిరిపోతే మెదడు పనితీరును తీవ్రంగా దెబ్బతీసి, ఇన్ ఫెక్షన్ కు దారితీస్తుంది. ఆ తర్వాత డీ హైడ్రేషన్, మాల్ న్యూట్రిషన్ వచ్చి చివరికి మరణానికి దారి తీస్తుంది. 5.8 మిలియన్ల అమెరికన్లు ఈ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తెలిపింది.

ఇటీవల కాలంలో చాలా వేగంగా వ్యాప్తి చెందున్న వ్యాధుల్లో అల్జీమర్స్ ఒకటి. ఇది నేరుగా మనిషి మెదడుపై ప్రభావం చూపుతుంది. దీని బారిన పడిన వ్యక్తులు ఏ విషయాన్నిజ్ఞాపకం ఉంచుకోలేరు. నెమ్మదిగా మొత్తం మెమరీని కోల్పోతారు. మొదట్లో మైల్డ్ మెమరీ లాస్ అవుతుంది. అంటే ఎప్పుడో జరిగిన సంఘటనలు గుర్తుండవు. అది నెమ్మదిగా బాగా ముదిరిపోతే అప్పుడే మాట్లాడిన విషయాలు కూడా మర్చిపోతారు. చూట్టు విషయాలు గుర్తించలేరు. ఎదుటి వ్యక్తులతో కూడా సరిగ్గా మాట్లాడలేరు. ఈ వ్యాధి మెదడుపై తీవ్రంగా దాడి చేసి ఆలోచనలు, జ్ఞాపకశక్తి, మాట్లాడే భాషను దెబ్బతీస్తుంది. అల్జీమర్స్ అనేది ఒక రకమైన డెమెన్షియా అని చెబుతారు. ఇది మనిషి వయసు పెరుగుతున్న కొద్దీ పెరిగి చివరికి అల్జీమర్స్ కి దారి తీస్తుంది. దీనికి చికిత్స అంటూ ఏమి లేదు. కానీ లక్షణాలు మరి ముదిరిపోకుండా కాపాడుకోవచ్చు. అందుకు ధ్యానం మీకు బాగా ఉపకరిస్తుంది. ఈ అల్జీమర్స్ బాగా ముదిరిపోతే మెదడు పనితీరును తీవ్రంగా దెబ్బతీసి, ఇన్ ఫెక్షన్ కు దారితీస్తుంది. ఆ తర్వాత డీ హైడ్రేషన్, మాల్ న్యూట్రిషన్ వచ్చి చివరికి మరణానికి దారి తీస్తుంది. 5.8 మిలియన్ల అమెరికన్లు ఈ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తెలిపింది. అయితే ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వారికి వేరే వ్యక్తుల సహాయం కొంత అవసరం అవుతుంది. అలాంటి వారికి ఉపయుక్తం అయ్యే కొన్ని టిప్స్ మీకు అందిస్తున్నాం..
- అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించిన వ్యక్తిని వారు ఏదిచేయాలనిపిస్తే దానిని చేయనివ్వాలి. అంటే వారికి నచ్చిన ఆహారం, దుస్తులు వారికి ఏది ఇష్టమో వాటిని చేయనివ్వాలి. మీ ఆలోచనలు వారిపై రుద్ద కూడదు.
- రోగికి మంచి వాతావరణం కల్పించాలి. ప్రతీది మరచిపోతారు కాబట్టి వారికి అవసరమయ్యే వస్తువులు వారి చుట్టూ కనపడేలా ఉంచాలి. అలాగే కిందపడిపోతే వారికి దెబ్బలు, గాయాలు అయ్యే విధంగా పరిసరాలు ఉంచకండి.
- ప్రతి రోజూ చేసే పనుల్లో వైవిధ్యాన్ని తొలగించండి. ఎందుకంటే వారికి అది అసౌకర్యంగా అనిపించవచ్చు. వారికి రోజూ ఒకే రకమైన అలవాట్లు ఉండేలా చేయాలి. అది వారికి బాగా ఉపకరిస్తుంది. అవి వారికి అలవాటు అయితే వారికి సులభంగా ఆ పనులు చేసుకోగలుగుతారు.
- వారి పనులు వారే చేసుకొనే విధంగా ప్రోత్సహించండి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి. అది వారిలో శక్తిని పెంచుతుంది. వారిలో కాన్ఫిడెన్స్ ను పెంచుతుంది.
- రోగులకు ఎమోషనల్ గా దగ్గరయ్యే సమూహాల్లో ఉండేలా చూడండి. వారితో ఓపికగా ఉండండి. ప్రత్యేకమైన కేర్ అవసరం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
