
స్త్రీకి అన్నిటికంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య నెలసరి. నెలనెలా వచ్చే ఈ ఇబ్బందిని తట్టుకోవడం అంత సులభం కాదు. కడుపునొప్పి, కాళ్లులాగడం, వికారం, వాంతులు, విసుగు, ఇలా ఎన్నో రకాల సమస్యలు వారిని ఇబ్బందిని పెడుతుంటాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ..కొన్ని నియమాలు పాటిస్తూ…ఆ రోజులను సులభంగా గడిపేయవచ్చు. ముఖ్యంగా నెలసరి సమయంలో పరిశుభ్రత చాలా అవసరం. వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడుకోవడానకి, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే పరిశుభ్రత చాలా ముఖ్యం.
1.శారీరకంగా చురుకుగా ఉండటం:
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం వల్ల తిమ్మిర్లు, శరీరనొప్పులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను అధిగమించవచ్చు. రుతుక్రమ అసౌకర్యం నుంచి ఉపశమనం పొందడమే కాకుండా…మనస్సును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. పీరియడ్స్ సమయంలో శారీరక శ్రమ కాస్త కష్టంగా అనిపించినా…మీరు సులభంగా ఉండే యోగా, తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు.
2. వీటిని సిద్ధంగా ఉంచుకోవాలి:
కొన్ని సందర్భాల్లో ఊహించకుండానే నెలసరి వస్తుంటుంది. అలాంటి సమయాల్లో కలిగే అసౌకర్య పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఎప్పుడూ శానిటరీ నాప్కిన్, మెన్స్ట్రువల్ కప్ లేదంటే టాంపోన్ సిద్ధంగా ఉంచుకోవాలి.
3. ఒత్తిడికి దూరంగా ఉండాలి:
పీరియడ్స్ సమయంలో తెలియన ఆందోళన ఉంటుంది. చిరాకు, కోపం వస్తుంది. మానసికంగా బలహీనంగా ఉంటాం. ఇలాంటి సమయాల్లో ఒత్తిడికి లోనవకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఒత్తిడికి దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంత కోసం థెరపి, మెడిటేషన్, మీకు నచ్చిన ఆహారం తీసుకోవడం మంచిది.
4. పీరియడ్స్ క్యాలెండర్:
మీ పీరియడ్స్ ను ట్రాక్ చేయడంలో మీకు సహాయపడే ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. మీ పీరియడ్స్ రికార్డును నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. తప్పిపోయిన పీరియడ్స్ లేదా ఏకపక్షబుుతురక్తస్రావం వంటి అంశాలను గుర్తించడంలో సహాయపడుతుంది.
1. సన్నిహిత వాష్‌లకు నో చెప్పండి:
పీరియడ్స్ సమయంలో శుభ్రత అనేది చాలా అవసరం. ముఖ్యమైన భాగాల్లో శుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా ఉంచేందుకు నీటితో కడిగితే సరిపోతుది. మీ యోని దాని చుట్టూ ఉన్న ప్రాంతం చాలా సున్నితమైంది కాబట్టి డౌచింగ్, సువాసనలతో కూడిన ఉత్పత్తులను ఉపయోగించడం చాలా ప్రమాదకరం. స్ర్కబ్బింగ్ వంటి పద్దతులకు దూరంగా ఉండాలి. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంటుంది.
2. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు:
నెలసరి సమయంలో శరీరంలో నుంచి రక్తం ఎక్కువ బయటకు వెళ్తుంది. దీంతో శరీరం బలహీనంగా మారుతుంది. ఈ సమయంలో ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇది మీ శరీరానికి శక్తిని అందిస్తుంది. పండ్లు, కూరగాయలు, లీన్ మాంసం, పోషకాహారాలు తీసుకోవడం మంచింది. ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి.
3. అక్కడ పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయవద్దు:
శానిటరీ ప్యాడ్‌లు లేదా టాంపాన్‌లను తరచుగా మారుస్తూ ఉండేలా చూసుకోండి. ప్రతి 4-6 గంటలకు ఒకసారి ప్యాడ్స్ మార్చుతూ ఉండాలి. బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే ప్రతి 2 గంటలకు ఒకసారి ప్యాడ్స్ మార్చుకోవాలి
4. నొప్పి నివారణ మందులకు దూరంగా ఉండండి:
కొంతమందికి పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి ఉంటుంది. దానిని నుంచి బయటపడేందుకు మందులు వాడుతుంటారు. అవి వికారం, తలనొప్పి కలిగిస్తాయి. పీరియడ్స్ సమయంలో మందులు కాకకుండా ఇంటి చిట్కాలు ఫాలో అవ్వడం మంచిది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం